News December 19, 2024
అశ్విన్ అందుకే రిటైర్ అయ్యారనుకుంటున్నా: హర్భజన్

అశ్విన్ రిటైర్మెంట్ వెనుక కారణాన్ని హర్భజన్ సింగ్ ఓ ఇంటర్వ్యూలో అంచనా వేశారు. ‘సిరీస్ నడుస్తుండగానే అశ్విన్ రిటైర్ కావడం చాలా ఆశ్చర్యం కలిగించింది. నాకున్న సమాచారం ప్రకారం.. BGT తర్వాత భారత్ స్వదేశంలో, ఇంగ్లండ్లో టెస్టులు ఆడనుంది. సెలక్టర్లు ఆ మ్యాచ్లకు అశ్విన్ను పరిగణించడం లేదు. అందుకే వెయిట్ చేయకుండా తనంతట తానే అశ్విన్ రిటైర్మెంట్ ప్రకటించారు’ అని పేర్కొన్నారు.
Similar News
News November 27, 2025
కడప బౌలర్ శ్రీచరణికి రూ.1.3 కోట్లు

WPL మెగావేలం-2026లో తెలుగు ప్లేయర్ శ్రీచరణిని ఢిల్లీ క్యాపిటల్స్ జట్టులోకి తీసుకుంది. ఈ కడప బౌలర్ను రూ.1.3 కోట్లకు సొంతం చేసుకుంది. ఇటీవల వన్డే ప్రపంచకప్లో శ్రీచరణి రాణించి గుర్తింపు తెచ్చుకున్నారు. మరోవైపు ఆఫ్ స్పిన్నర్ స్నేహ్ రాణాను రూ.50 లక్షలకు ఢిల్లీ కొనుగోలు చేసింది.
News November 27, 2025
PPPని వెనక్కి తీసుకునే వరకు పోరాటం ఆగదు: బొత్స

AP: జగన్కు మంచి పేరు రాకూడదనే కూటమి ప్రభుత్వం మెడికల్ కాలేజీలను ప్రైవేటీకరిస్తోందని MLC బొత్స సత్యనారాయణ అన్నారు. జిల్లాకో మెడికల్ కాలేజీ ఉండాలనే ఆలోచనతో జగన్ ముందుకెళ్లారని, ప్రజల ఆరోగ్యం కోసం వైద్యరంగానికి నిధులు కేటాయించారని తెలిపారు. ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా సంతకాలు సేకరిస్తున్నామని, అన్ని విషయాలు గవర్నర్కు వివరించామని చెప్పారు. PPPని వెనక్కి తీసుకునే వరకు తమ పోరాటం ఆగదని స్పష్టం చేశారు.
News November 27, 2025
WPL షెడ్యూల్ విడుదల

మహిళల ప్రీమియర్ లీగ్ (WPL) షెడ్యూల్ను బీసీసీఐ విడుదల చేసింది. వచ్చే ఏడాది జనవరి 9 నుంచి ఫిబ్రవరి 5 వరకు 4వ ఎడిషన్ కొనసాగనుంది. నవీ ముంబైలోని డీవై పాటిల్ స్టేడియంలో, వడోదరలోని బీసీఏ స్టేడియంలో మ్యాచ్లు నిర్వహించనున్నారు. ఇవాళ WPL మెగా ఆక్షన్ ప్రారంభం సందర్భంగా ఈ వివరాలను లీగ్ ఛైర్మన్ జయేశ్ జార్జ్ ప్రకటించారు. ప్రస్తుతం ప్లేయర్ల వేలం కొనసాగుతోంది. మ్యాచ్ల తేదీలు త్వరలోనే వెల్లడించనున్నారు.


