News April 11, 2024
ఆ సమయంలో చనిపోతానేమో అనిపించింది: రణదీప్ హుడా

బాలీవుడ్ యాక్టర్ రణదీప్ హుడా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ‘‘స్వాతంత్ర్య వీర్ సావర్కర్’ సినిమా కోసం ఎంతో కష్టపడ్డాను. సావర్కర్ పాత్రకోసం ఏకంగా 26 కేజీలకుపైగా బరువు తగ్గాను. అందుకోసం రోజూ ఒక ఖర్జూర పండు, గ్లాసు పాలు మాత్రమే తీసుకున్నా. ఆ సమయంలో ఇక చనిపోతానేమో అనిపించింది’ అని హుడా పేర్కొన్నారు. కాగా ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద మిక్స్డ్ టాక్ తెచ్చుకుంది.
Similar News
News November 26, 2025
పాక్ మాజీ ప్రధాని ఇమ్రాన్ చనిపోయారా?

పాక్ మాజీ PM ఇమ్రాన్ ఖాన్ జైలులో చనిపోయినట్లు వార్తలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఇమ్రాన్ను చూసేందుకు రావల్పిండిలోని అడియాలా జైలుకు వచ్చిన ఆయన ముగ్గురు సోదరీమణులను పోలీసులు అడ్డుకున్నారు. దీంతో జైలు బయట PTI మద్దతుదారులతో కలిసి వారు ఆందోళనకు దిగారు. తమ సోదరుడిని చూపించాలని డిమాండ్ చేశారు. పోలీసులు తమపై దాడి చేశారని, జుట్టుపట్టుకుని ఈడ్చుకెళ్లారని ఆరోపించారు. 2023 ఆగస్టు నుంచి ఇమ్రాన్ జైలులో ఉన్నారు.
News November 26, 2025
మూవీ అప్డేట్స్

* ప్రభాస్, డైరెక్టర్ మారుతి కాంబోలో తెరకెక్కుతోన్న ‘రాజాసాబ్’ మూవీపై అంచనాలు భారీగా పెరిగాయి. రిలీజ్కు ముందే కేవలం తెలుగు స్టేట్స్లోనే రూ.130కోట్లకు పైగా బిజినెస్ చేసినట్లు సినీవర్గాలు తెలిపాయి. ఈ చిత్రం 2026 జనవరి 9న విడుదల కానుంది.
*నందమూరి బాలకృష్ణ, గోపీచంద్ మలినేని కాంబోలో రాబోతున్న ‘NBK111’ సినిమా పూజా కార్యక్రమాలతో ప్రారంభమైంది. ఈ హిస్టారికల్ మూవీలో బాలయ్య డ్యుయల్ రోల్లో నటిస్తారని టాక్.
News November 26, 2025
iBOMMA రవికి 14 రోజుల జుడీషియల్ రిమాండ్

iBOMMA నిర్వాహకుడు ఇమ్మడి రవికి నాంపల్లి కోర్టు 14 రోజుల జుడీషియల్ రిమాండ్ విధించింది. మరో 3 కేసుల్లోనూ సైబర్ క్రైమ్ పోలీసులు అతడిపై పీటీ వారెంట్ వేశారు. సైబర్ క్రైమ్ పోలీసులు అతనిపై మొత్తం 5 కేసులు నమోదు చేశారు. రవి కస్టడీ పిటిషన్పై కాసేపట్లో కోర్టు తీర్పు వెల్లడించనుంది.


