News December 17, 2024
ఆ ఫొటోలు లీకైనప్పుడు కెరీర్ ముగిసిందనుకున్నా: మహీరా ఖాన్

రణ్‌బీర్ కపూర్‌తో కలిసి సిగరెట్ తాగిన ఫొటోలు లీక్ అయినప్పుడు తన కెరీర్ నాశనమైందని భావించినట్లు పాకిస్థాన్ నటి మహీరా ఖాన్ అన్నారు. ఫొటోల కారణంగా వృత్తిపరంగా, వ్యక్తిగతంగానూ చాలా కోల్పోయానని ఆమె వాపోయారు. ‘నా జీవితంలో పెళ్లి, విడాకులు, పాప పుట్టడం, సింగిల్‌గా ఉండటం, రణ్‌బీర్‌తో కలిసి ఉన్న ఫొటోలు లీక్ కావడం, ఓ దేశంలో నాపై నిషేధం విధించడం. ఇవన్నీ నాకు కష్టకాలంగా అనిపించాయి’ అని ఆమె పేర్కొన్నారు.
Similar News
News January 4, 2026
ఇతిహాసాలు క్విజ్ – 117 సమాధానం

ఈరోజు ప్రశ్న: శ్రీకృష్ణుడి దగ్గర పాంచజన్యం అనే శంఖంతో పాటు అతి శక్తిమంతమైన విల్లు ఉంది. దాని పేరేంటి? ఎవరు తయారుచేశారు?
సమాధానం: కృష్ణుడు కురుక్షేత్రంలో ఆయుధం పట్టనని చెప్పినప్పటికీ, ఆయన దగ్గర ‘శారంగం’ అనే శక్తిమంతమైన విల్లు ఉంది. ఇది విశ్వకర్మ తయారుచేసిన దివ్యాయుధం. అర్జునుడి గాండీవమే గాక శారంగం కూడా తిరుగులేని ఆయుధంగా పేరుగాంచింది. కృష్ణుడి నందకం అనే ఖడ్గం కూడా ఉంటుంది. <<-se>>#Ithihasaluquiz<<>>
News January 4, 2026
డబ్బు సేవ్ చేయకండి.. కియోసాకి సలహా

గతంలో ఉద్యోగం ఉంటే జీవితానికి భద్రత ఉండేదని రిచ్ డాడ్ పూర్ డాడ్ బుక్ రైటర్ రాబర్ట్ కియోసాకి పేర్కొన్నారు. ‘ఇప్పుడు అన్ని పరిస్థితులు మారిపోయాయి. 2025లో పెద్ద టెక్ కంపెనీలే వేల కొద్దీ ఉద్యోగులను తొలగించాయి. అందుకే మీ ఫైనాన్షియల్ IQని పెంచుకోండి. ఎప్పుడూ డబ్బును సేవ్ చేయకండి. బంగారం, వెండి, బిట్ కాయిన్, ఇథీరియమ్ వంటి వాటిని సేవ్ చేసుకోండి’ అని ట్వీట్ చేశారు.
News January 4, 2026
హిల్ట్ పాలసీపై రేపు అసెంబ్లీలో చర్చ

TG: BRS సవాల్‌తో నిన్న అసెంబ్లీలో కృష్ణా జలాలపై చర్చించిన ప్రభుత్వం మరో కీలక అంశంపై డిబేట్‌కు సిద్ధమైంది. హిల్ట్ పాలసీపై రేపు సభలో చర్చించాలని నిర్ణయించింది. ఈ పాలసీ రాష్ట్రంలో తీవ్ర రాజకీయ దుమారం రేపిన విషయం తెలిసిందే. భూదోపిడీ కోసమే ప్రభుత్వం దీన్ని తీసుకొచ్చిందంటూ బీఆర్ఎస్ ఆరోపిస్తోంది. అసెంబ్లీ వేదికగా వీటిని తిప్పికొట్టాలని సీఎం రేవంత్ భావిస్తున్నారు. అయితే BRS సమావేశాలు బహిష్కరించింది.


