News June 27, 2024
నేనూ సోషల్ మీడియా బాధితురాలినే: హోంమంత్రి అనిత

AP: వైసీపీ ప్రభుత్వంలో నిబంధనలు పాటించని అధికారులపై చర్యలు తీసుకోవడానికే రెడ్ బుక్ అని హోంమంత్రి అనిత స్పష్టం చేశారు. వైజాగ్ సీపీ కార్యాలయంలో పోలీసు ఉన్నతాధికారులతో ఆమె సమావేశమయ్యారు. తాను సోషల్ మీడియా బాధితురాలినేనని చెప్పారు. అసభ్య పోస్టులపై చర్యలు తీసుకుంటామన్నారు. వైసీపీ ప్రభుత్వంలో పోలీసు వ్యవస్థను నాశనం చేశారని దుయ్యబట్టారు. కేంద్ర నిధులొచ్చినా పోలీసు అకాడమీ నిర్మాణాలు చేయలేదన్నారు.
Similar News
News March 1, 2026
3 నెలల్లో 3 టార్గెట్లు.. నెక్స్ట్ ఎవరో!

2026 ప్రారంభంలో అమెరికా తీసుకున్న సంచలన నిర్ణయాలు ప్రపంచాన్ని ఆశ్చర్యపరిచాయి. జనవరిలో వెనిజులా అధ్యక్షుడు నికోలస్ మదురోను బంధించడం, ఫిబ్రవరిలో మెక్సికన్ డ్రగ్ లార్డ్ ఎల్ మెంచో హతమవ్వడం, తాజాగా ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ చనిపోవడం సంచలనంగా మారాయి. ఈ వరుస పరిణామాలతో అమెరికా తదుపరి టార్గెట్ ఎవరనే చర్చ నెట్టింట జోరుగా సాగుతోంది. అగ్రరాజ్యం తన దూకుడుతో అంతర్జాతీయ రాజకీయ ముఖచిత్రాన్ని వేగంగా మారుస్తోంది.
News March 1, 2026
హైదరాబాద్‌లో టీచింగ్ పోస్టులు

<
News March 1, 2026
ఆరోగ్యం కోసం ఏం మానేయాలంటే?

బాలార్కో ప్రేతధూమశ్చ వృద్ధా స్త్రీ పల్వలోదకమ్|
రాత్రౌ దధ్యన్నభుక్తిశ్చ ఆయుఃక్షీణం దినే దినే||
సూర్యోదయ సమయంలో వచ్చే ఎండ, శ్మశానంలోని దహన పొగ, వయసు మళ్లిన స్త్రీతో పొందు, నిల్వ ఉన్న మురికి గుంటలోని నీరు తాగడం, రాత్రి పెరుగన్నం తినడం మంచిది కాదు. దీనివల్ల ఆయుష్షు రోజురోజుకూ క్షీణిస్తుంది. రాత్రిపూట పెరుగుకు బదులుగా పాలు తీసుకోవచ్చు. పాలన్నం కూడా ఆరోగ్యకరమే. ఈ నియమాలను పాటిస్తే సంపూర్ణ ఆరోగ్యం.


