News January 13, 2025
కపిల్ దేవ్‌ను కాల్చేద్దామని తుపాకి తీసుకెళ్లా: యువరాజ్ తండ్రి
కపిల్‌దేవ్ హరియాణా జట్టుకు కెప్టెన్‌గా ఉన్న సమయంలో ఎలాంటి కారణం లేకుండా తనను టీమ్ నుంచి తొలగించినట్లు యువరాజ్ తండ్రి యోగ్రాజ్ తెలిపారు. ఆ సమయంలో కోపంలో కపిల్ ఇంటికి తుపాకితో వెళ్లానన్నారు. కపిల్ తల్లితో కలిసి బయటకు రాగా అతడిని తీవ్రంగా తిట్టానని, తలలోకి బుల్లెట్ దించాలని అనుకున్నట్లు చెప్పారు. వాళ్ల అమ్మను చూసి ఆగిపోయానన్నారు. ఆ తర్వాత క్రికెట్ ఆడకూడదని డిసైడ్ అయినట్లు యోగ్రాజ్ తెలిపారు.
Similar News
News January 13, 2025
‘భోగి’ అనే పేరు ఎలా వచ్చిందంటే..
భుగ్ అనే సంస్కృత పదం నుంచి ‘భోగి’ అనే పదం వచ్చిందని పురాణాలు చెబుతున్నాయి. భోగం అంటే పవిత్రమైనది. పురాణాల ప్రకారం శ్రీరంగనాథ స్వామిలో గోదా దేవి లీనమై భోగాన్ని పొందింది. ఇదే రోజున విష్ణువు వామనావతరంలో బలిని పాతాళానికి అణచివేశాడు. గోకులంలో శ్రీకృష్ణుడు గోవర్ధన పర్వతాన్ని ఎత్తి గోవులను, గోపాలకులను రక్షించారని చెబుతారు. వీటన్నింటికి ప్రతీకగా భోగి పండుగ జరుపుకోవడం సంప్రదాయంగా మారిందని పురాణ గాథ.
News January 13, 2025
CT-2025: ఆస్ట్రేలియా టీమ్ ఇదే
ఛాంపియన్స్ ట్రోఫీ-2025 కోసం క్రికెట్ ఆస్ట్రేలియా తన స్క్వాడ్ ప్రకటించింది. కమిన్స్ సారథిగా ఉంటారని వెల్లడించింది.
టీమ్: కమిన్స్ (C), హెడ్, మిచెల్ మార్ష్, స్టీవ్ స్మిత్, లబుషేన్, షార్ట్, స్టాయినిస్, ఇల్లిస్, ఇంగ్లిస్, కారే, హార్డీ, మ్యాక్స్‌వెల్, జంపా, స్టార్క్, హేజిల్‌వుడ్.
News January 13, 2025
గాలిపటాలు ఎగురవేస్తున్నారా?
సంక్రాంతి అంటేనే గాలిపటాలు ఎగురవేయడం తప్పనిసరి. ముఖ్యంగా పిల్లలు గాలిపటాలు ఎగురవేయాలని ఉత్సాహపడుతుంటారు. వీటిని ఎగురవేసే సమయంలో మాంజాను కాకుండా సాధారణ దారాలను ఉపయోగించాలి. రోడ్ల పక్కన, రైల్వే ట్రాకులు, విద్యుత్ పోల్స్ సమీపంలో ఎగరవేయడం ప్రమాదకరం. భవనాలపై ఎగురవేసినప్పుడు, చిన్నపిల్లలు పక్కన ఉంటే జాగ్రత్తగా ఉండాలి. కాళ్లకు గాయాలు కాకుండా షూలు, చెప్పులు ధరించడం తప్పనిసరి.