News December 25, 2024

ఒకప్పుడు విపరీతంగా తాగేవాడిని: ఆమిర్ ఖాన్

image

తన వ్యక్తిగత జీవితంలో క్రమశిక్షణ లేకపోయినా సినిమా షూటింగ్‌లకు ఎప్పుడూ ఆలస్యంగా వెళ్లలేదని హీరో ఆమిర్ ఖాన్ వెల్లడించారు. ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ తనకు ఎన్నో చెడు అలవాట్లు ఉండేవని ఒప్పుకున్నారు. ‘నేను విపరీతంగా మద్యం తాగేవాడిని. పైప్ స్మోకింగ్ చేసేవాడిని. తప్పుచేస్తున్నానని గ్రహించినా మానలేకపోయా. సినిమానే నాలో మార్పు తీసుకొచ్చింది’ అని చెప్పారు. ఇకపై ఏడాదికి ఓ మూవీ చేస్తానని పేర్కొన్నారు.

Similar News

News November 27, 2025

ములుగు: ఎన్నికల సమాచారం కోసం కంట్రోల్ రూమ్

image

పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో ఫిర్యాదులు, సమాచారం కోసం కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశామని ములుగు జిల్లా కలెక్టర్ దివాకర టీఎస్ తెలిపారు. జిల్లాలో మొదటి విడతలో 48 సర్పంచ్, 420 వార్డు సభ్యుల స్థానాలకు నామినేషన్ ప్రక్రియ కొనసాగుతుందన్నారు. నిర్వహణ కోసం ఫ్లయింగ్, స్టాటిస్టిక్, వీడియో సర్వేలెన్స్ బృందాలు, ఎంసీఎంసీ, ఎంసీసీ, ఇతర ఎన్నికల సంబంధిత పర్యవేక్షణ అధికారులను నియమించామని చెప్పారు.

News November 27, 2025

భాస్వరం, నత్రజని ఎరువులను ఎలా వాడితే ఎక్కువ ప్రయోజనం?

image

పంట నాటిన/విత్తిన రెండు వారాలలోపే మొత్తం భాస్వరం ఎరువులను పంటలకు వేయాలి. పైపాటుగా వాడకూడదు. నత్రజని, పొటాష్ ఎరువులను పూతదశకు ముందే వేసుకోవాలి. సిఫారసు చేసిన మొత్తం నత్రజని ఎరువులను ఒకే దఫాలో కాకుండా మూడు దఫాలుగా (నాటిన/విత్తిన తర్వాత, శాఖీయ దశలో, పూతకు ముందు) వేయడం వల్ల పంటకు ఎరువుల వినియోగ సామర్థ్యం పెరిగి అధిక దిగుబడి వస్తుంది. సూక్ష్మపోషక ఎరువులను పంటకు స్ప్రే రూపంలో అందించాలి.

News November 27, 2025

అటు అనుమతి, ఇటు విరాళం.. టాటా గ్రూపుపై సంచలన ఆరోపణలు!

image

BJPకి టాటా గ్రూపు లంచం ఇచ్చిందంటూ సీనియర్ లాయర్ ప్రశాంత్ భూషణ్ సంచలన ఆరోపణలు చేశారు. టాటా గ్రూపు, BJPపై scroll.in రాసిన కథనాన్ని షేర్ చేశారు. ‘సెమీకండక్టర్ యూనిట్లకు మోదీ క్యాబినెట్ ఆమోదం తెలపగానే BJPకి అతిపెద్ద దాతగా టాటా గ్రూపు ఎలా మారింది? 2 యూనిట్లకు సబ్సిడీ కింద ₹44,203Cr టాటాకు వస్తాయి. క్యాబినెట్ అప్రూవల్ వచ్చిన 4 వారాలకు ₹758Crను BJPకి విరాళంగా ఇచ్చింది. ఇది లంచం’ అని ట్వీట్ చేశారు.