News April 25, 2025
రోజూ 40 రోటీలు తినేవాడిని: జైదీప్

తనకు 28 ఏళ్ల వయసు వచ్చే వరకు రోజూ 40 రోటీలు తిని, లీటరున్నర పాలు తాగేవాడినని ‘పాతాళ్‌లోక్’ ఫేమ్ జైదీప్ అహ్లావత్ వెల్లడించారు. అయినా తాను 70KGల బరువు దాటలేదని ఓ ఇంటర్వ్యూలో తెలిపారు. ఒక వయసు దాటాక తిండిలో మార్పులు చేసుకోవాలని, అప్పుడే జీవనశైలి బాగుంటుందని చెప్పారు. ఎక్కడ షూటింగ్ జరిగినా ఇప్పటికీ ఇంటి ఆహారమే తింటానన్నారు. విదేశాలకు వెళ్లినప్పుడు అందుబాటులో ఉన్నవాటితో సర్దుకుంటానని పేర్కొన్నారు.
Similar News
News April 25, 2025
GHMC: ప్రారంభమైన ఓట్ల లెక్కింపు

హైదరాబాద్ జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల ఓట్ల లెక్కింపు GHMC ప్రధాన కార్యాలయంలో కాసేపటి క్రితం ప్రారంభమైంది. ఈ ఎన్నికలు ఈ నెల 23న జరిగాయి. 78.57 శాతం పోలింగ్ నమోదైంది. 112 ఓట్లకు గాను 88 ఓట్లు పోలయ్యాయి. బీజేపీ, కాంగ్రెస్, ఎంఐఎంకు చెందిన 66 మంది కార్పొరేటర్లు, 22 మంది ఎక్స్ అఫీషియో సభ్యులు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. BRS కార్పొరేటర్లు ఓటింగ్‌కు దూరంగా ఉన్నారు.
News April 25, 2025
కాసేపట్లో జమ్మూకశ్మీర్‌కు భారత ఆర్మీ చీఫ్

భారత్, పాక్ మధ్య ఉద్రిక్తతల వేళ ఆర్మీ చీఫ్ జనరల్ ఉపేంద్ర ద్వివేది మరికాసేపట్లో శ్రీనగర్, ఉదమ్‌పూర్‌కు వెళ్లనున్నారు. అక్కడ ఆర్మీ సీనియర్ కమాండర్లతో ఆయన భేటీ అవుతారు. LoC వద్ద ప్రస్తుత పరిస్థితులపై ఆరా తీయనున్నారు. తదుపరి చేపట్టాల్సిన చర్యలపై ద్వివేది వారికి దిశానిర్దేశం చేయనున్నారు.
News April 25, 2025
పాక్‌ను బెదిరిస్తే సమస్యలు పరిష్కారం కావు: శివసేన UBT

పహల్గామ్ ఉగ్రదాడి పూర్తిగా కేంద్ర ప్రభుత్వ వైఫల్యమేనని శివసేన(ఉద్ధవ్ వర్గం) తమ అధికారిక పత్రిక సామ్నాలో విమర్శించింది. ‘ఆర్టికల్ 370 రద్దు వల్ల కశ్మీర్‌లో ఏం ఒరిగింది? హిందువులపై హింస ఆగిందా? జేమ్స్‌బాండ్‌లా ఫోజులిచ్చే అజిత్ దోవల్ ఏం చేస్తున్నారు? పాక్‌ను బెదిరించినంత మాత్రాన సమస్యలు పరిష్కారం కావు. హిందువులపై దాడి జరగగానే పాకిస్థాన్, ముస్లింలపై ఏడవటం బీజేపీకి అలవాటు అయిపోయింది’ అని మండిపడింది.