News January 31, 2025

రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని కోరుకున్నా: సీఎం

image

AP: పెనుగొండ శ్రీ వాసవీ కన్యకా పరమేశ్వరి అమ్మవారి ఆశీస్సులతో రాష్ట్రం సర్వతోముఖాభివృద్ధి చెందాలని సీఎం చంద్రబాబు ఆకాంక్షించారు. అమ్మవారికి ఆత్మార్పణ సందర్భంగా పట్టువస్త్రాలు సమర్పించిన అనంతరం గురుపీఠం నిర్మాణానికి CM శంకుస్థాపన చేశారు. ఈ ఆలయానికి ఎన్నో ఏళ్ల చరిత్ర ఉందని, అమ్మవారిని వేడుకుంటే సకల శుభాలు కలుగుతాయని భక్తుల విశ్వాసమని సీఎం చెప్పారు. ఆ తర్వాత సీఎంకు వేద పండితులు ఆశీర్వచనం అందించారు.

Similar News

News November 21, 2025

సంగారెడ్డి: షూటింగ్ విజేతలకు కలెక్టర్ అభినందనలు

image

భద్రాద్రి జిల్లాలో జరిగిన ఎస్జీఎఫ్(SGF) క్రీడా పోటీల్లో భాగంగా నిర్వహించిన షూటింగ్ పోటీలో సంగారెడ్డి టీం సభ్యులు పాల్గొన్నారు. ప్రతిభ చాటిన వారిని కలెక్టర్ జితేష్ పాటిల్ అభినందించి, ధ్రువపత్రాలు అందజేశారు. జాతీయ స్థాయిలో జిల్లా టీం ప్రాతినిధ్యం వహించేలా కృషి చేస్తామని షూటింగ్ జిల్లా కార్యదర్శి శేశ్వంత్ తెలిపారు.

News November 21, 2025

ఏపీ సచివాలయం వద్ద భద్రత పెంపు

image

AP: రాష్ట్రంలో మావో అగ్రనేత హిడ్మా ఎన్‌కౌంటర్, మరో 51 మంది మావోయిస్టులు అరెస్టయిన నేపథ్యంలో పోలీసులు అప్రమత్తమయ్యారు. వెలగపూడి సచివాలయం వద్ద భద్రతను కట్టుదిట్టం చేశారు. ప్రతి వాహనాన్ని క్షుణ్ణంగా తనిఖీ చేస్తున్నారు. అలాగే ఉద్యోగుల ఐడీ కార్డులను పరిశీలించిన తర్వాతే లోపలికి పంపుతున్నారు. విజయవాడ పరిసరాల్లో మరింత మంది మావోలు ఉండొచ్చనే సమాచారంతో అప్రమత్తంగా వ్యవహరిస్తున్నారు.

News November 21, 2025

మిస్‌ యూనివర్స్‌-2025 ఫాతిమా బాష్‌ గురించి తెలుసా?

image

అత్యంత ప్రతిష్ఠాత్మకంగా జరిగిన 74వ మిస్ యూనివర్స్-2025 పోటీల్లో “ఫాతిమా బాష్” విశ్వసుందరి కిరీటం దక్కించుకున్నారు. మెక్సికోలోని శాంటియాగో డి తెపా ప్రాంతానికి చెందిన ఫాతిమా ఫ్యాషన్‌ డిజైనింగ్‌ చేశారు. స్కూల్‌లో చదువుతున్నప్పుడు డిస్లెక్సియా, హైపర్‌యాక్టివిటీ డిజార్డర్‌తో బాధపడిన ఆమె వాటిని దాటుకొని అందాల పోటీలకు ప్రాతినిధ్యం వహించడమే కాకుండా 121 దేశాల అందగత్తెలను దాటి మిస్ యూనివర్స్‌గా నిలిచారు.