News October 6, 2025

‘అన్నమయ్య’ లాంటి సినిమా చేయాలని ఉంది: నాగచైతన్య

image

తనకు అన్నమయ్య, శ్రీ రామదాసు లాంటి సినిమాలు చేయాలని ఉందని నాగచైతన్య తెలిపారు. నాగార్జున నటించిన ‘నిన్నే పెళ్లాడతా’, వెంకటేశ్ ‘ఇంట్లో ఇల్లాలు వంటింట్లో ప్రియురాలు’ సినిమాలను బోర్ అనేదే లేకుండా 100 సార్లు చూస్తానని ఓ TVలో షోలో చెప్పారు. ప్రస్తుతం ఆయన ‘విరూపాక్ష’ డైరెక్టర్ కార్తీక్ దండుతో ఓ మూవీ చేస్తున్నారు. దీనికి ‘వృషకర్మ’ అనే టైటిల్‌ను పరిశీలిస్తున్నారు. ఈ సినిమా వచ్చే ఏడాది థియేటర్లలోకి రానుంది.

Similar News

News October 6, 2025

విశాఖలో ‘ఆపరేషన్ లంగ్స్’ కొనసాగుతుంది

image

విశాఖలో ‘ఆపరేషన్ లంగ్స్’ కొనసాగుతోందని జీవీఎంసీ అదనపు కమిషన్ డి.వి. రమణమూర్తి, చీఫ్ సిటీ ప్లానర్ ఏ.ప్రభాకర్‌రావు తెలిపారు. దసరా సందర్భంగా ఆక్రమణల తొలగింపునకు తాత్కాలిక విరామం ఇచ్చారు. పలువురు స్వచ్ఛందంగా ఆక్రమణలు తొలగించుకున్నప్పటకీ, కొన్ని ప్రాంతాల్లో ఇంకా ఆక్రమణలు కొనసాగుతున్నాయన్న ఫిర్యాదులు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో వాటిని తొలగిచేందుకు ఆపరేషన్ లంగ్స్ కొనసాగిస్తున్నట్లు అధికారులు చెబుతున్నారు.

News October 6, 2025

స్పోర్ట్స్ రౌండప్ @ 6 అక్టోబర్

image

⚾ భారత షట్లర్ తస్నీం మీర్‌పై గెలిచిన తెలుగమ్మాయి శ్రియాన్షి వలిశెట్టి కెరీర్‌లో తొలి BWF సూపర్ 100 టైటిల్ పొందారు
⚾ప్రపంచ పారా అథ్లెటిక్స్ ఛాంపియన్‌షిప్స్‌లో భారత్ చరిత్రలో తొలిసారి అత్యధికంగా 22 మెడల్స్ (6G, 9S, 7B) సాధించింది
⚾ UP యోధాస్‌ను ఓడించిన తెలుగు టైటాన్స్‌కు PKL-12లో వరుసగా నాలుగో విజయం
⚾ వెస్టిండీస్‌పై గెలవడంతో WTC ర్యాంకింగ్స్‌లో భారత్ 3వ స్థానానికి (AUS-1, SL-2) చేరింది

News October 6, 2025

మీ పిల్లల్ని స్కూల్‌కు పంపకండి: BAS

image

ఇకపై పిల్లలను తమ స్కూళ్లకు పంపకండంటూ TGలోని బెస్ట్ అవైలబుల్ స్కూల్స్(BAS) యాజమాన్యం పేరెంట్స్‌కు లేఖ రాసింది. రెండేళ్లుగా ప్రభుత్వం స్టూడెంట్ల ఫీజు చెల్లించకున్నా అప్పులు చేసి మరీ నెట్టుకొస్తున్నామని పేర్కొంది. ఇవాళ్టి నుంచి విద్యార్థుల్ని పాఠశాలల్లోకి అనుమతించమని స్పష్టం చేసింది. దీంతో రాష్ట్రంలోని 238 BASల్లో చదువుతున్న 23వేల మంది SC, 7వేల మంది ST విద్యార్థుల భవిష్యత్తుపై ఆందోళన నెలకొంది.