News January 2, 2025

కలుసుకోవాలని..! సినిమా కాదు రాజకీయ ఎత్తుగడ

image

మహారాష్ట్రలో కుటుంబ కథా రాజకీయ డ్రామా కొనసాగుతోంది. చీలిన NCP మళ్లీ ఒక్కటయ్యేందుకు బీజం పడ్డట్టే కనిపిస్తోంది. 2 వర్గాల MP, MLAలు ఇదే రాగం ఆలపిస్తున్నారు. శరద్ పవార్ తనకు దేవుడని, తన ఛాతీని చీలిస్తే ఆయనే కనిపిస్తారని అజిత్ వర్గం నేత ప్రఫుల్ పటేల్ అన్నారు. మళ్లీ కుటుంబం, పార్టీ కలవాలని అజిత్ తల్లి ఆశాథాయి పండరీపురి విఠలుడిని వేడుకున్నారు. త్వరలోనే శరద్‌ను కలిసి విషయం ప్రతిపాదిస్తానని పేర్కొన్నారు.

Similar News

News October 14, 2025

హోమీ బాబా క్యాన్సర్ హాస్పిటల్‌లో ఉద్యోగాలు

image

బిహార్‌లోని హోమీ బాబా క్యాన్సర్ హాస్పిటల్& సెంటర్‌ వివిధ పోస్టులకు వేర్వేరుగా నోటిఫికేషన్ విడుదల చేసింది. టెన్త్, ఐటీఐ, ఇంటర్, సబ్ ఫైర్ ఆఫీసర్ కోర్సు అర్హతతో 14 పంప్ ఆపరేటర్, ఫైర్‌మెన్, సబ్ ఫైర్ ఆఫీసర్ పోస్టులకు ఈనెల 24న ఇంటర్వ్యూ నిర్వహించనుంది. 2ఫోర్‌మెన్, 1టెక్నీషియన్ పోస్టులకు NOV 4న, నర్సు, డిస్ట్రిక్ టెక్నికల్ ఆఫీసర్, తదితర పోస్టులకు NOV 14న ఇంటర్వ్యూ ద్వారా భర్తీ చేయనుంది.

News October 14, 2025

WCలో RO-KO ఆడతారా.. గంభీర్ ఆన్సర్ ఇదే!

image

దిగ్గజ ప్లేయర్లు విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ 2027 వన్డే వరల్డ్ కప్‌లో ఆడే విషయమై తాను గ్యారంటీ ఇవ్వలేనని టీమ్ఇండియా హెడ్ కోచ్ గంభీర్ చెప్పారు. అది వారి ఫిట్‌నెస్‌తో పాటు స్థిరమైన ప్రదర్శనపై ఆధారపడి ఉంటుందని అభిప్రాయపడ్డారు. రాబోయే ఆస్ట్రేలియా టూర్‌లో మెరుగైన ప్రదర్శన చేస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు. టెస్టులు, T20Iలకు వీడ్కోలు చెప్పిన రోహిత్, కోహ్లీ వన్డేల్లో కొనసాగుతున్న సంగతి తెలిసిందే.

News October 14, 2025

ఇది భారత చరిత్రలో నిలిచిపోయే రోజు: అదానీ

image

గూగుల్‌తో కలిసి దేశంలోనే అతిపెద్ద AI డేటా సెంటర్‌ను విశాఖలో నిర్మిస్తున్నందుకు గర్వంగా ఉందని అదానీ గ్రూప్ అధినేత గౌతమ్ అదానీ అన్నారు. ‘ఇది భారత చరిత్రలో నిలిచిపోయే రోజు. దేశంలోని అత్యంత కీలకమైన విద్య, వ్యవసాయం, ఫైనాన్స్ తదితర రంగాలకు AI ద్వారా పరిష్కారాలు చూపే ఎకోసిస్టమ్‌ను ఈ హబ్ క్రియేట్ చేస్తుంది. AI రెవల్యూషన్‌కు తోడ్పడే ఇంజిన్‌ను నిర్మించడాన్ని గౌరవంగా భావిస్తున్నాం’ అని ట్వీట్ చేశారు.