News October 12, 2025
2027 వరల్డ్ కప్ ఆడాలని ఉంది: జడేజా

తనను ఆస్ట్రేలియాతో వన్డే సిరీస్‌కు ఎంపిక చేయకపోవడంపై ముందే చర్చించారని టీమ్ ఇండియా ఆల్‌రౌండర్ జడేజా పేర్కొన్నారు. ‘నా సెలక్షన్‌పై మేనేజ్మెంట్, కోచ్, కెప్టెన్, సెలక్టర్లు డెసిషన్ తీసుకున్నారు. కారణాలేంటో నాకు చెప్పారు. 2027 WCకంటే ముందు కొన్ని వన్డేలు ఉన్నాయి. అవకాశం వచ్చినప్పుడల్లా పర్ఫార్మ్ చేసి వరల్డ్ కప్ టీమ్‌లో ప్లేస్ సాధించే ప్రయత్నం చేస్తా. ప్రపంచ కప్ కలను నిజం చేసుకుంటాను’ అని తెలిపారు.
Similar News
News October 12, 2025
దేవుడు ఎవరికి కనిపిస్తాడంటే?

బ్రాహ్మణులకు, యజ్ఞాలు చేసేవారికి అగ్నియే దేవుడు. ధ్యానం చేసే మునులకు హృదయమే దేవుడు. అల్పబుద్ధి గల సామాన్యులు విగ్రహాలను దైవంగా భావిస్తారు. అయితే సమదృష్టి గల మహాత్ములు మాత్రం అన్ని చోట్లా దేవుణ్ని చూడగలుగుతారని శాస్త్రాలు చెబుతున్నాయి. సర్వం దైవ స్వరూపమే అని గ్రహించిన వారికి సకలమూ దైవమయంగా, ఆనందమయంగా కనిపిస్తుంది. వారికి నిజమైన జ్ఞానం సిద్ధిస్తుంది. <<-se>>#WhoIsGod<<>>
News October 12, 2025
‘గాజా పీస్ డీల్’కు హమాస్ ససేమిరా!

ఈజిప్ట్‌లో జరగనున్న ‘గాజా పీస్ డీల్’ కార్యక్రమానికి హమాస్ దూరంగా ఉండనున్నట్లు తెలుస్తోంది. US అధ్యక్షుడు ట్రంప్ ప్రతిపాదించిన శాంతి ఒప్పందంలో హమాస్‌కు అభ్యంతరాలున్నట్లు అంతర్జాతీయ మీడియా పేర్కొంది. ‘పాలస్తీనియన్లు హమాస్ సభ్యులు అయినా, కాకపోయినా వారిని వారి దేశం నుంచి బహిష్కరించడం గురించి మాట్లాడటం అర్థంలేనిది. ఆయుధాల అప్పగింతకు అసలు తావులేదు’ అని హమాస్ లీడర్లు చెప్పినట్లు వార్తలొచ్చాయి.
News October 12, 2025
Women’s WC: నేడు ఆసీస్‌తో హర్మన్ సేన ఢీ

మహిళల వన్డే WCలో భాగంగా విశాఖ వేదికగా ఇవాళ మ.3 గం.కు INDW-AUSW జట్లు తలపడపనున్నాయి. ఈ మ్యాచ్‌కు అన్ని టికెట్లు బుక్ అవ్వడం విశేషం. భారత్ తొలి 2మ్యాచులు గెలిచి SAతో ఓడిపోయింది. అటు ఆసీస్ టీమ్ మంచి ఫామ్‌లో ఉంది. 2 విజయాలతోపాటు వర్షం కారణంగా SLతో మ్యాచ్ రద్దవడంతో పాయింట్లు పంచుకుంది. స్ట్రాంగ్ బ్యాటింగ్ లైనప్ ఉన్న AUSపై గెలవాలంటే కచ్చితంగా IND టాపార్డర్ సత్తా చాటాల్సిందే.