News March 13, 2025
ఎవరు తలుపు కొడతారోనని భయపడేదాన్ని: హీరోయిన్

ఇండస్ట్రీకి వచ్చిన తొలినాళ్లలో సేఫ్టీ విషయంలో చాలా కష్టపడ్డానని బాలీవుడ్ నటి దియా మీర్జా ఓ ఇంటర్వ్యూలో తెలిపారు. ‘ఎప్పుడు ఎవరు తలుపు కొడతారోనని భయంతో మేకప్ ఆర్టిస్ట్‌ను ఎప్పుడూ సాయంగా ఉంచుకునేదాన్ని. ఇతర హీరోయిన్ల తలుపులు చాలామంది కొట్టి ఉంటారు. నేను అప్పటికే అందాల పోటీ గెలవడం వల్ల, ఫేమస్ కావడంతో అంత త్వరగా ఎవరూ మిస్‌బిహేవ్ చేయలేదు’ అని పేర్కొన్నారు.
Similar News
News November 16, 2025
నేను 2 గంటలే నిద్రపోతా: జపాన్ ప్రధాని

జపాన్ ప్రధాని సనే తకైచి ఆసక్తికర విషయాలు వెల్లడించారు. తాను రోజూ రాత్రి కేవలం 2 గంటలు, మహా అయితే 4 గంటలు మాత్రమే నిద్రపోతానని తెలిపారు. ఈ అలవాటు తన స్కిన్‌కు చేటు చేస్తుందని అన్నారు. ఇటీవల పార్లమెంట్ సమావేశాల కోసం అధికారులతో 3am వరకు మీటింగ్ పెట్టడంతో ఆమెపై విమర్శలు వచ్చాయి. జపాన్‌లో వర్క్ లైఫ్ బ్యాలెన్స్ సరిగా లేదంటూ పలువురు అసహనం వ్యక్తం చేస్తున్నారు.
News November 16, 2025
APPLY NOW: MECLలో ఉద్యోగాలు

మినరల్ ఎక్స్‌ప్లోరేషన్ అండ్ కన్సల్టెన్సీ లిమిటెడ్ (<
News November 16, 2025
వేదాలను ఎందుకు అధ్యయనం చేయాలి?

వేదాలు అమూల్య రత్నాలు గల మహాసముద్రాల కంటే లోతైన జ్ఞానాన్ని కలిగి ఉన్నాయి. అందుకే వాటిని అధ్యయనం చేయాలి. వీటిలో విశ్వ రహస్యాలు, సైంటిఫిక్ విషయాలు ఎన్నో ఉన్నాయి. ఇవి ఇహ, పరలోకాల్లో శాశ్వత ఆనందాన్ని, సుఖాలను అందించే మార్గాన్ని చూపుతాయి. సామాన్య మానవుడిని పరిపూర్ణ వ్యక్తిగా తీర్చిదిద్దుతాయి. మన జీవితాన్ని ఉన్నతంగా, సంతోషంగా మార్చుకోవడానికి, సృష్టి రహస్యాలు తెలుసుకోవడానికి వేదాలు చదవాలి. <<-se>>#VedikVibes<<>>


