News November 14, 2024
నన్ను కమిట్మెంట్ అడిగారు: హీరోయిన్

ఊరు పేరు భైరవకోన, డబుల్ ఇస్మార్ట్, విశ్వం తదితర సినిమాలతో హీరోయిన్ కావ్యా థాపర్ టాలీవుడ్లో దూసుకెళ్తున్నారు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో తనకెదురైన చేదు అనుభవాన్ని పంచుకున్నారు. ‘కెరీర్ తొలి రోజుల్లో ఓ యాడ్ ఆడిషన్స్‌కి వెళ్లాను. అక్కడున్న ఓ వ్యక్తి 4 యాడ్స్‌లో అవకాశాలిప్పిస్తానని, కమిట్మెంట్ ఇవ్వాలని అన్నాడు. నాకు చాలా కోపం వచ్చింది. ఇలాంటివి నాకు నచ్చవని మొహమ్మీదే చెప్పి బయటికొచ్చేశాను’ అని తెలిపారు.
Similar News
News January 13, 2026
రాష్ట్రంలో రూ.3,538 కోట్లతో సోలార్ కాంప్లెక్స్

AP: తిరుపతి జిల్లాలోని MP-SEZలో వెబ్‌సోల్ సంస్థ రూ.3,538 కోట్లతో 8GW ఇంటిగ్రేటెడ్ సోలార్ మాన్యుఫ్యాక్చరింగ్ కాంప్లెక్స్ ఏర్పాటు చేయనుంది. ఇందులో 4GW సోలార్ సెల్స్, 4GW సోలార్ మాడ్యూల్స్ తయారీ యూనిట్లు ఉంటాయి. 2 దశల్లో 120 ఎకరాల్లో అభివృద్ధి చేసే ఈ ప్రాజెక్టు ద్వారా 2,000 మందికి ఉపాధి లభించనుంది. దీనికి అవసరమైన విద్యుత్ కోసం 300 ఎకరాల్లో 100MW క్యాప్టివ్ సోలార్ పవర్ ప్లాంట్‌ను ఏర్పాటు చేయనున్నారు.
News January 13, 2026
డయాబెటిస్ భారం.. భారత్‌కు రెండో స్థానం

డయాబెటిస్ వల్ల అత్యధిక ఆర్థిక భారం పడుతున్న దేశాల జాబితాలో భారత్ రెండో స్థానంలో నిలవడం ఆందోళన కలిగిస్తోంది. తాజా అధ్యయనం ప్రకారం ఇండియాపై డయాబెటిస్ కారణంగా 11.4 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక భారం పడుతోంది. ఈ జాబితాలో US 16.5 ట్రిలియన్ డాలర్లతో టాప్‌లో ఉండగా, 11 ట్రిలియన్ డాలర్లతో చైనా మూడో స్థానంలో ఉంది. వైద్య ఖర్చులు పెరగడం ప్రజల ఆదాయంపై తీవ్ర ప్రభావం చూపుతోందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
News January 13, 2026
లింగాకర్షక బుట్టలతో పురుగుల బెడద తగ్గుతుంది

లింగాకర్షక బుట్టల్లో ఉండే ‘ల్యూర్’ మగ రెక్కల పురుగులను ఆకర్షిస్తుంది. ఫలితంగా మగ, ఆడ రెక్కల పురుగుల మధ్య కలయిక జరగకుండా వాటి సంతానోత్పత్తి వృద్ధి చెందకుండా ఉంటుంది. కత్తెర పురుగు, గులాబి రంగు పురుగు, శనగపచ్చ పురుగు, పొగాకు లద్దె పురుగు, కూరగాయల్లో పండుఈగ, కొబ్బరి, ఆయిల్ పామ్‌లో కొమ్ము పురుగులకు ప్రత్యేకమైన ల్యూర్స్ అందుబాటులో ఉన్నాయి. వీటిని పొలంలో అమర్చి వాటి ఉద్ధృతిని అదుపులో ఉంచుకోవచ్చు.


