News April 12, 2025

నా సినిమా సీక్వెల్‌లో నన్నే పక్కనపెట్టారు: హీరోయిన్

image

డ్రీమ్ గర్ల్ మూవీ సీక్వెల్‌లో తనను కాదని అనన్యా పాండేను తీసుకోవడంతో చాలా బాధపడ్డానని బాలీవుడ్ హీరోయిన్ నుష్రత్ ఆవేదన వ్యక్తం చేశారు. ‘నా సినిమా సీక్వెల్‌లో నన్నే పక్కనపెట్టారు. బాధపడడం తప్ప ఏం చేయలేకపోయాను. ఇతరుల నిర్ణయాలను మనం నియంత్రించలేం కదా?’ అంటూ తాజాగా ఓ ఇంటర్వ్యూలో వ్యాఖ్యానించారు. కాగా ఆయుష్మాన్ ఖురానా, అనన్య నటించిన ‘డ్రీమ్ గర్ల్ 2’ 2023లో విడుదలై సూపర్ హిట్‌గా నిలిచింది.

Similar News

News January 3, 2026

HYD: మూడు చోట్లా కాంగ్రెస్ జెండా ఎగరాలనేదే ప్లాన్

image

HYD, సైబరాబాద్, మల్కాజిగిరి కార్పొరేషన్ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా కాంగ్రెస్ కసరత్తు చేస్తోంది. ఈ ప్రాంతాల్లో జెండా ఎగురవేయాలని గాంధీభవన్ వర్గాలు నేతలకు దిశానిర్దేశం చేశాయి. జూబ్లీహిల్స్ గెలుపు స్ఫూర్తితో క్షేత్రస్థాయిలో ప్రజలతో మమేకమై ప్రభుత్వ పథకాలను వివరించాలని అధిష్ఠానం సూచించింది. అధిక స్థానాల్లో కార్పొరేటర్లను గెలిపించి, నగర రాజకీయాలపై పట్టు సాధించేలా వ్యూహాలు సిద్ధం చేస్తున్నారు.

News January 3, 2026

కాళేశ్వరంపై మోజు.. పాలమూరుపై నిర్లక్ష్యం: ఉత్తమ్

image

TG: మాజీ సీఎం కేసీఆర్ కాళేశ్వరం ప్రాజెక్టుపై అధిక మోజు చూపి, కావాలనే పాలమూరు-రంగారెడ్డిని నిర్లక్ష్యం చేశారని మంత్రి ఉత్తమ్ మండిపడ్డారు. ‘జూరాల నుంచి అయితే రోజుకు 2.8 టీఎంసీల చొప్పున 60 రోజుల్లో 121 టీఎంసీల నీటిని తరలించే అవకాశం ఉండేది. కానీ సోర్స్‌ను జూరాల నుంచి కాకుండా శ్రీశైలానికి మార్చడం వల్ల కేవలం 68 టీఎంసీలే తీసుకునేలా చేశారు. దీని వల్ల అంచనా వ్యయం రూ.85వేల కోట్లకు చేరింది’ అని తెలిపారు.

News January 3, 2026

చుక్క నీటిని వదులుకోం: ఉత్తమ్ కుమార్

image

TG: కృష్ణాజలాల్లో చుక్క నీటిని కూడా వదులుకోబోమని అసెంబ్లీలో PPT సందర్భంగా మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి స్పష్టం చేశారు. బీఆర్ఎస్ హయాంలో నీటి విషయంలో రాష్ట్రానికి అన్యాయం చేశారని మండిపడ్డారు. పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టు పనులు 99శాతం చేశామన్న కేసీఆర్ వ్యాఖ్యలు అబద్ధమని విమర్శించారు. తాము అధికారంలోకి వచ్చాకే ప్రాజెక్టు పనులు పునరుద్ధరించినట్లు చెప్పారు.