News August 20, 2024

ఆయన సరసన నటించడం నా అదృష్టం: ప్రియాంక

image

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సరసన ‘ఓజీ’ సినిమాలో నటించడం తన అదృష్టమని హీరోయిన్ ప్రియాంక మోహన్ అన్నారు. ఈ అవకాశం ఇచ్చిన దర్శకనిర్మాతలకు ధన్యవాదాలు తెలిపారు. ‘సరిపోదా శనివారం’ మూవీ ప్రమోషన్లలో ఆమె మాట్లాడారు. పవన్, నాని ఎప్పుడూ క్రియేటివ్‌గా ఆలోచిస్తారని చెప్పారు. పవన్ ప్రజల గురించి ఆలోచిస్తే, నాని సినిమాల గురించి కలలు కంటారని తెలిపారు. కాగా సరిపోదా శనివారం మూవీ ఈ నెల 29న థియేటర్లలో విడుదల కానుంది.

Similar News

News November 11, 2025

నిఠారి కిల్లింగ్స్: సురేంద్ర కోలికి సుప్రీంలో ఊరట

image

నిఠారి వరుస హత్యల చివరి కేసులో సురేంద్ర కోలి దోషి కాదని సుప్రీంకోర్టు ఇవాళ తీర్పిచ్చింది. మిగతా కేసుల్లోనూ రిలీఫ్ పొందిన కోలి త్వరలో జైలు నుంచి విడుదల కానున్నాడు. నోయిడా శివారు నిఠారి గ్రామంలో 2006 DEC 29న మోహిందర్ పందేర్ ఇంటి వెనక డ్రెయిన్‌లో 8 మంది చిన్నారుల ఎముకలు లభ్యమయ్యాయి. దీనిపై దర్యాప్తు చేసిన CBI పందేర్, కోలి హత్యాచారాలకు పాల్పడ్డారని తేల్చింది. అయితే కోర్టుల్లో నిరూపించలేకపోయింది.

News November 11, 2025

టమాటాలో బాక్టీరియా ఎండు తెగులును ఎలా నివారించాలి?

image

బాక్టీరియా ఎండు తెగులు సోకిన టమాటా మొక్కలను పీకి దూరంగా తీసుకెళ్లి కాల్చివేయాలి. మొక్కను తొలగించిన చోట వెంటనే బ్లీచింగ్ పౌడర్ చల్లాలి. ఇలా చేయడం వల్ల బాక్టీరియా ఇతర మొక్కలకు సోకదు. టమాటా నారును నాటుకునే ముందే వేపపిండిని నేలలో చల్లుకోవడం వల్ల ఈ తెగులు వృద్ధి చెందకుండా చేసుకోవచ్చు. తెగులు సోకిన మొక్కలు పొలంలో ఉన్నప్పుడు నీటి తడులు ఇస్తే ఈ తెగులు ఉద్ధృతి మరింత పెరిగి నివారణ కష్టమవుతుంది.

News November 11, 2025

స్టాక్ మార్కెట్లో LIC ₹16 లక్షల కోట్ల పెట్టుబడి

image

LIC అంటే తెలియని వారుండరు. ఇందులో అనేకమంది భాగస్వామ్యం ఉంది. వారి సొమ్ము లక్షల కోట్లు ఇందులో ఉన్నాయి. ఇలా వచ్చిన సొమ్మును సంస్థ పలు రంగాల్లో పెట్టుబడులుగా పెడుతోంది. ఇలా ఇప్పటివరకు ₹16 లక్షల కోట్లు పెట్టింది. తాజాగా HDFC, ICICI వంటి ప్రయివేటు బ్యాంకుల షేర్లను విక్రయించి SBIలో పెట్టుబడి పెట్టింది. ఇటీవల అదానీ కంపెనీలో పెట్టుబడి పెట్టగా విమర్శలు రావడంతో స్వయంగానే నిర్ణయం తీసుకున్నట్లు ప్రకటించింది.