News August 17, 2024
‘తంగలాన్’లో అవకాశం రావడం నా అదృష్టం: మాళవిక

‘తంగలాన్’ షూటింగ్ రోజులను ఎప్పటికీ మర్చిపోలేనని హీరోయిన్ మాళవిక మోహనన్ తెలిపారు. ఇందులో నటించే అవకాశం రావడం తన అదృష్టమన్నారు. ఇలాంటి విభిన్నమైన కథ, బలమైన పాత్రలతో చిత్రాన్ని తెరకెక్కించడం సాహసమని అభిప్రాయపడ్డారు. ఈ మూవీ AUG 30న బాలీవుడ్లోనూ రిలీజ్ అవుతుందని, అక్కడ ప్రేక్షకులూ ఆదరిస్తారనే నమ్మకం ఉందని చెప్పారు. తమిళ, తెలుగు భాషల్లో ఈ నెల 15న విడుదలైన ఈ చిత్రానికి పాజిటీవ్ రెస్పాన్స్ వస్తోంది.
Similar News
News November 25, 2025
ఇతిహాసాలు క్విజ్ – 77

ఈరోజు ప్రశ్న: ద్రోణాచార్యుడు ఏకలవ్యుడి బొటన వేలిని గురుదక్షిణగా అడగడానికి గల కారణం ఏంటి?
☛ పై ప్రశ్నకు జవాబును సాయంత్రం ఆరు గంటలకు పబ్లిష్ చేస్తాం.
☛ మీకు సమాధానం తెలిస్తే కామెంట్ రూపంలో తెలియజేయండి.
<<-se>>#Ithihasaluquiz<<>>
News November 25, 2025
విక్రమ్ సారాభాయ్ స్పేస్ సెంటర్లో ఉద్యోగాలు

ఇస్రో-<
News November 25, 2025
అధిక సాంద్రత పత్తిసాగు – ఎందుకు ప్రత్యేకం?

ఈ విధానంలో సాధారణ పత్తి సాగుకు భిన్నంగా మొక్కల మధ్య దూరం తగ్గించి ఎకరాకు వీలైనన్ని ఎక్కువ మొక్కలు నాటాలి. సాధారణ పత్తి సాగులో వరుసల మధ్య 90 సెం.మీ., మొక్కల మధ్య 60 సెంమీ. ఎడం ఉండేలా నాటాలి. అధిక సాంద్రత పద్ధతిలో వరుసల మధ్య 80 సెం.మీ, మొక్కల మధ్య 20 సెం.మీ (లేదా) వరుసల మధ్య 90 సెం.మీ, మొక్కల మధ్య 10 సెంటీమీటర్ల ఎడం ఉండేలా నాటాలి. దీంతో ఎకరం విస్తీర్ణంలో ఎక్కువ మొక్కల వల్ల దిగుబడి బాగా పెరుగుతుంది.


