News March 15, 2025
పవన్ స్పీచ్‌కు మంత్రముగ్ధుడినయ్యా: చిరంజీవి

ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ జయకేతనం సభలో ప్రసంగానికి మంత్రముగ్ధుడినయ్యానని మెగాస్టార్ చిరంజీవి ప్రశంసించారు. సభకు వచ్చిన జనసంద్రంలాగే తన మనసు ఉప్పొంగిందని ట్వీట్ చేశారు. ప్రజల ఆకాంక్షల్ని నెరవేర్చే నాయకుడొచ్చాడన్న నమ్మకం మరింత బలపడిందన్నారు. ప్రజా సంక్షేమం కోసం ఉద్యమస్ఫూర్తితో పవన్ జైత్రయాత్ర నిర్విఘ్నంగా కొనసాగాలని మెగాస్టార్ ఆశీర్వదించారు.
Similar News
News December 1, 2025
మాయదారి మహమ్మారికి ఆరేళ్లు..!

ప్రపంచాన్ని అతలాకుతలం చేసిన ‘కరోనా’ మహమ్మారిని నెటిజన్లు గుర్తుచేసుకుంటున్నారు. చైనా వుహాన్‌లో తొలి కరోనా కేసు నమోదై నేటికి ఆరేళ్లు. 2019లో మొదలైన ఈ మహమ్మారి అతి తక్కువ కాలంలోనే ప్రపంచాన్ని చుట్టుముట్టింది. 70లక్షల మంది ప్రాణాలను హరించి, కోట్లాది మందిని రోడ్డున పడేసింది. భారీ ఆర్థిక సంక్షోభం ఎదుర్కొన్న మానవాళి.. టీకాలు, ఆరోగ్య నియమాలతో పోరాడి గెలిచింది. కరోనా మీ జీవితంలో ఎలాంటి మార్పులు తెచ్చింది?
News December 1, 2025
రేపు హైకోర్టుకు పరకామణి కేసు నివేదిక

AP: టీటీడీ పరకామణి కేసు విచారణ నేటితో పూర్తి కానుంది. రేపు సీఐడీ అధికారులు హైకోర్టుకు నివేదిక సమర్పించనున్నారు. హైకోర్టు ఆదేశాలతో అక్టోబర్ 27 నుంచి సీఐడీ.. టీటీడీ మాజీ ఛైర్మన్లు వైవీ సుబ్బారెడ్డి, కరుణాకర్ రెడ్డి, మాజీ ఈవో ధర్మారెడ్డి సహా 35 మందిని విచారించింది. విచారణకు హాజరవుతూ అప్పటి AVSO సతీశ్ అనుమానాస్పదంగా మరణించారు. చెన్నై, బెంగళూరు, విశాఖలో నిందితుడు రవికుమార్ ఆస్తులను పరిశీలించింది.
News December 1, 2025
‘దిత్వా’ తుఫాన్.. ఈ జిల్లాలకు వర్ష సూచన

AP: నైరుతి బంగాళాఖాతంలో ‘దిత్వా’ తుఫాన్ ఈ మధ్యాహ్నంలోపు వాయుగుండంగా బలహీనపడే అవకాశం ఉందని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ పేర్కొంది. దీని ప్రభావంతో ఇవాళ నెల్లూరు, తిరుపతిలో భారీ నుంచి అతిభారీ వర్షాలు.. కృష్ణా, గుంటూరు, బాపట్ల, పల్నాడు, ప్రకాశం, కడప, కర్నూలు, అన్నమయ్య, చిత్తూరు, అంబేడ్కర్ కోనసీమ, పశ్చిమగోదావరి జిల్లా మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది.


