News March 26, 2025

నాకు హోం శాఖ ఇవ్వాలి అని అనలేదు: రాజ్‌గోపాల్ రెడ్డి

image

TG: హోంశాఖ అంటే ఇష్టమని తాను చెప్పినట్లుగా జరుగుతున్న ప్రచారాన్ని INC MLA కోమటిరెడ్డి రాజ్‌గోపాల్ రెడ్డి ఖండించారు. ‘నేను హోం శాఖ మంత్రి అయితే బాగుంటుందని నా ఫ్యాన్స్, కార్యకర్తలు అభిప్రాయపడుతున్నట్లు మీడియాతో చెప్పాను. అంతేతప్ప నాకు హోంశాఖ ఇవ్వాలి, అది అయితేనే బాగుంటుందని అనలేదు. మంత్రివర్గ విస్తరణపై అధిష్ఠానం నిర్ణయమే ఫైనల్. ఏ శాఖ ఇచ్చినా బాధ్యతయుతంగా పనిచేస్తా’ అని స్పష్టం చేశారు.

Similar News

News December 6, 2025

సెల్యూట్ డాక్టర్.. 1.2లక్షల మందికి ఉచితంగా..!

image

నిస్సహాయులకు వైద్యం అందని చోట డాక్టర్ సునీల్ కుమార్ హెబ్బీ ఆశాదీపంగా మారారు. పేరు కోసం కాకుండా సేవ చేయడానికి తన కారును ‘సంచార క్లినిక్‌’గా మార్చుకున్నారు. బెంగళూరు వీధుల్లోని పేదలకు ఇంటి వద్దే ఉచితంగా చికిత్స అందిస్తున్నారు. ఒక రోడ్డు ప్రమాదంతో మొదలైన ఈ గొప్ప ప్రయాణం ఇప్పటికే 1.2 లక్షల మందికిపైగా ప్రాణాలను కాపాడింది. వైద్య పరికరాలతో నిండిన ఆయన కారు ఎంతో మందికి కొత్త జీవితాన్నిస్తోంది.

News December 6, 2025

గ్లోబల్ సమ్మిట్‌కు ప్రత్యేక విమానాలు: భట్టి

image

TG: ఈ నెల 8, 9న ఫ్యూచర్ సిటీలో జరగనున్న గ్లోబల్ సమ్మిట్‌ను రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంది. ఈ సదస్సుకు వచ్చే ప్రముఖుల కోసం ప్రత్యేక విమానాలు ఏర్పాటు చేయనున్నట్లు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క తెలిపారు. కాగా ఇండిగో విమానాల రద్దు నేపథ్యంలో ప్రభుత్వం అప్రమత్తమైంది. దీంతో సమ్మిట్‌కు వచ్చే వారు ఇబ్బందులు పడకుండా ఉండేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.

News December 6, 2025

వేంకన్న గుడికి పట్నాలో 10.11 ఎకరాలు

image

పట్నాలో తిరుమల వేంకన్న గుడి నిర్మాణానికి 10.11 ఎకరాలను బిహార్ ప్రభుత్వం కేటాయించింది. ₹1 టోకెన్ రెంటుతో 99 ఏళ్ల లీజుకు ఈ భూమిని ఇచ్చింది. ఈమేరకు ఆ రాష్ట్ర CS ప్రతయ అమృత్ TTD ఛైర్మన్ బీఆర్ నాయుడికి లేఖ రాశారు. ఈ నిర్ణయంతో ఆ రాష్ట్రంలో టీటీడీ ధార్మిక కార్యక్రమాల నిర్వహణకు అవకాశం ఏర్పడిందని నాయుడు తెలిపారు. త్వరలో ఆ రాష్ట్ర ప్రతినిధులను సంప్రదించి ఆలయ నిర్మాణానికి చర్యలు చేపడతామని పేర్కొన్నారు.