News December 19, 2024
నన్ను తోసేశారు.. మోకాలికి గాయమైంది: ఖర్గే

పార్లమెంటు అవరణలో నిరసన తెలుపుతున్న తనను BJP MPలు తోయడంతో మోకాలికి గాయమైనట్టు ఖర్గే ఆరోపించారు. దీనిపై విచారణ జరిపించాలని కోరుతూ ఆయన లోక్‌సభ స్పీకర్‌కు లేఖ రాశారు. ఇది తనపై జరిగిన వ్యక్తిగత దాడి మాత్రమే కాదని, రాజ్యసభ ప్రతిపక్ష నేత హోదాపై జరిగిన దాడని పేర్కొన్నారు. బీజేపీ ఎంపీలు తోయడం వల్లే కింద పడిపోయానని, ఇది వరకే సర్జరీ జరిగిన మోకాలికి గాయమైందన్నారు.
Similar News
News November 21, 2025
7337359375 నంబర్‌కు HI అని పంపితే..

AP: అన్నదాతలు ధాన్యం విక్రయించే ప్రక్రియను సులభతరం చేసినట్లు మంత్రి నాదెండ్ల మనోహర్ వెల్లడించారు. 7337359375 వాట్సాప్ నంబర్‌కు HI అని మెసేజ్ పంపితే సేవల వినియోగంపై AI వాయిస్ అవగాహన కల్పిస్తుందన్నారు. ‘తొలుత రైతులు ఆధార్ నంబర్ నమోదు చేశాక పేరును ధ్రువీకరించాలి. తర్వాత ధాన్యం విక్రయించే కేంద్రం, తేదీ, సమయం, ఎన్ని బస్తాలు అమ్ముతారో నమోదుచేయాలి. వెంటనే స్లాట్ బుక్ అవుతుంది’ అని చెప్పారు.
News November 21, 2025
750 పోస్టులు.. అప్లైకి ఎల్లుండే లాస్ట్ డేట్

పంజాబ్ నేషనల్ బ్యాంక్‌లో 750 LBO పోస్టులకు అప్లై చేయడానికి ఎల్లుండే ఆఖరు తేదీ. డిగ్రీతో పాటు పని అనుభవం గల వారు అప్లై చేసుకోవచ్చు. TGలో 88, APలో 5 పోస్టులు ఉన్నాయి. వయసు 20 -30 ఏళ్ల మధ్య ఉండాలి. రాత పరీక్ష, స్క్రీనింగ్, లాంగ్వేజ్ ప్రొఫిషియెన్సీ టెస్ట్, ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తారు. *మరిన్ని ఉద్యోగాల కోసం <<-se_10012>>జాబ్స్<<>> కేటగిరీకి వెళ్లండి.
News November 21, 2025
ప్రసార్‌భారతిలో 29 పోస్టులకు నోటిఫికేషన్

న్యూఢిల్లీలోని <


