News September 16, 2024
ముంబైలో జానీ మాస్టర్ నాపై అత్యాచారం చేశారు: బాధితురాలు

TG: లైంగిక వేధింపుల <<14112127>>కేసులో<<>> కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్‌పై నమోదు చేసిన FIRలో బాధితురాలు సంచలన విషయాలు వెల్లడించారు. ‘2017లో ఢీ షోలో జానీ మాస్టర్‌తో పరిచయమైంది. 2019లో అసిస్టెంట్ కొరియోగ్రాఫర్‌గా నియమించుకున్నారు. ఓ షో కోసం ముంబై వెళ్లినప్పుడు నాపై అత్యాచారం చేశారు. ఈ విషయం ఎవరికైనా చెబితే చంపేస్తానని బెదిరించారు. మతం మార్చుకొని అతడిని పెళ్లి చేసుకోవాలని బలవంతం చేశారు’ అని తెలిపారు.
Similar News
News October 16, 2025
మాజీ సైనికోద్యోగుల పిల్లల పెళ్లికి రూ.లక్ష

పెన్షన్‌కు అర్హులుకాని మాజీ సైనికోద్యోగులకు ఇచ్చే ఆర్థికసాయం 100% పెంపు ప్రతిపాదనలకు రక్షణశాఖ ఆమోదం తెలిపింది. పెనూరీ గ్రాంట్‌ను రూ.4 వేల నుంచి రూ.8 వేలకు పెంచింది. పెన్షన్‌కు అర్హతలేని సైనికోద్యోగుల భార్యల్లో(విడో) ఎలాంటి ఆదాయంలేని, 65 ఏళ్లు పైబడిన వారికి రూ.8వేల చొప్పున ఇవ్వనుంది. పిల్లల చదువు కోసం నెలకు రూ.వెయ్యి నుంచి రూ.2 వేలు, అమ్మాయిల పెళ్లికి ఇచ్చే రూ.50 వేల సాయాన్ని రూ.లక్షకు పెంచింది.
News October 16, 2025
3,073 SI పోస్టులు.. అప్లైకి ఇవాళే లాస్ట్ డేట్

SSCలో 3,073 SI పోస్టులకు అప్లై చేయడానికి ఇవాళే ఆఖరు తేదీ. ఢిల్లీలో 212, CAPF’Sలో 2,861 పోస్టులు ఉన్నాయి. ఏదైనా డిగ్రీ ఉత్తీర్ణులై, 20 -25ఏళ్ల మధ్య వయసు ఉన్నవారు అప్లై చేసుకోవచ్చు. రిజర్వేషన్ గలవారికి ఏజ్‌లో సడలింపు ఉంది. దరఖాస్తు ఫీజు రూ.100, SC, ST, మహిళలకు ఫీజు నుంచి మినహాయింపు ఉంది. రాతపరీక్ష, PST/PET, మెడికల్ టెస్ట్ ద్వారా ఎంపిక చేస్తారు. వెబ్‌సైట్: https://ssc.gov.in/
News October 16, 2025
పూజలో ఈ నియమాలు పాటిస్తున్నారా?

కొన్ని నియమాలు పాటించకపోతే పూజా ఫలితం దక్కదని పండితులు చెబుతున్నారు. ‘పూజా గదిలో గణేషుడి చిత్రపటాలు ఒకటి కంటే ఎక్కువ ఉండకూడదు. నిలబడి పూజలు చేయకూడదు. పూజకు ముందు కాళ్లకు పసుపు రాసుకోవాలి. స్త్రీలు నుదుట కుంకుమ కచ్చితంగా పెట్టుకోవాలి. మంగళవారం, శుక్రవారం, అమావాస్య రోజున దేవుడి పటాలను శుభ్రం చేయడం శుభప్రదం కాదు. ఈ నియమాలు పాటిస్తే శుభకార్యాలు నిరాటంకంగా జరుగుతాయి’ అని సూచిస్తున్నారు. <<-se>>#Pooja<<>>