News February 28, 2025
సబ్ జైలుకు పోసాని.. ఖైదీ నంబర్ ఎంతంటే?

AP: సినీనటుడు పోసాని కృష్ణమురళిని పోలీసులు రాజంపేట సబ్ జైలుకు తరలించారు. అక్కడ ఆయనకు జైలు అధికారులు 2261 నంబర్ కేటాయించారు. పోసాని కోసం జైలులో ఓ గది ఏర్పాటు చేసినట్లు తెలుస్తోంది. కాగా పోసానికి కేటాయించిన నంబర్లను కలిపితే 11 వస్తోందంటూ టీడీపీ కార్యకర్తలు సోషల్ మీడియాలో సెటైర్లు వేస్తున్నారు. వైసీపీకి ఆ నంబర్ కలిసొచ్చిందంటూ జోకులు వేసుకుంటున్నారు.
Similar News
News December 5, 2025
మెదక్: రైతుల కష్టాలపై విద్యార్థుల ప్రదర్శన అదుర్స్

మెదక్ జిల్లా సైన్స్ ఫెయిర్లో నవాబుపేట ప్రాథమికోన్నత పాఠశాల విద్యార్థులు రైతుల సమస్యలపై రూపొందించిన ప్రదర్శన ఆకట్టుకుంది. పంట కోత అనంతరం రోడ్లపై ధాన్యం ఆరబెట్టడానికి పడుతున్న ఇబ్బందులను దృష్టిలో ఉంచుకొని, ధాన్యాన్ని ఆరబెట్టడం, ఎత్తడం, కుప్పలు చేయడంలో ఒకే వ్యక్తి ఉపయోగించే సులభమైన యంత్రాన్ని ప్రదర్శించారు. టీచర్ అశోక్ దేవాజీ మార్గదర్శకత్వంలో దీన్ని రూపొందించారు.
News December 5, 2025
చలికాలం.. నిండా దుప్పటి కప్పుకుంటున్నారా?

చలికాలం కావడంతో కొందరు తల నుంచి కాళ్ల వరకు ఫుల్గా దుప్పటిని కప్పుకొని పడుకుంటారు. ఇలా చేస్తే శరీరానికి కావాల్సిన ఆక్సిజన్ అందక రక్తప్రసరణ తగ్గి గుండెపై ప్రభావం పడుతుందని వైద్యులు హెచ్చరిస్తున్నారు. జీర్ణక్రియ కూడా మందగిస్తుందట. ‘దుప్పటి ముఖానికి అడ్డుగా ఉంటే CO2 లెవల్స్ పెరిగి మెదడు పనితీరుపై ఎఫెక్ట్ చూపుతుంది. O2, Co2 మార్పిడికి అడ్డంకి ఏర్పడి శ్వాసకోస సమస్యలొస్తాయి’ అని చెబుతున్నారు.
News December 5, 2025
పాక్ తొలి CDFగా ఆసిమ్ మునీర్ నియామకం

పాకిస్థాన్ ఫీల్డ్ మార్షల్గా ఉన్న ఆసిమ్ మునీర్ను ఆ దేశ తొలి చీఫ్ ఆఫ్ డిఫెన్స్ ఫోర్సెస్(CDF)గా నియమిస్తూ అధ్యక్ష కార్యాలయం ప్రకటన జారీ చేసింది. ఆర్మీ స్టాఫ్ చీఫ్ పదవితో పాటు CDFగానూ ఐదేళ్ల పాటు కొనసాగుతారని చెప్పింది. అలాగే ఎయిర్ చీఫ్ మార్షల్ జహీర్ అహ్మద్ బాబర్ పదవీ కాలాన్ని రెండేళ్లు పొడిగించింది. వీరిద్దరికి అధ్యక్షుడు అసిఫ్ అలీ జర్దారీ శుభాకాంక్షలు తెలిపినట్లు అధ్యక్ష కార్యాలయం పేర్కొంది.


