News August 20, 2025

దాడి తర్వాత షాక్‌కు గురయ్యా: CM రేఖా గుప్తా

image

తనపై జరిగిన దాడి విషయంపై ఢిల్లీ సీఎం <<17460103>>రేఖా గుప్తా<<>> స్పందించారు. ‘దాడి జరగగానే షాక్‌కు గురయ్యా. ఇప్పుడు తేరుకున్నాను. ఇది ఢిల్లీకి సేవ చేయాలనే మా సంకల్పంపై జరిగిన పిరికిపంద చర్య. ప్రజలకు సేవ చేయాలనే నా స్ఫూర్తిని ఇలాంటి దాడులు ఆపలేవు. త్వరలోనే ప్రజల ముందుకు వస్తాను. ప్రజల నుంచి ఫిర్యాదుల స్వీకరణ, పరిష్కారం మునుపటిలాగానే కొనసాగుతాయి. ప్రజల మద్దతే నాకు కొండంత బలం’ అని Xలో పోస్ట్ చేశారు.

Similar News

News March 5, 2026

భావిభారత పౌరులు.. ఊబకాయులు!

image

ప్రాసెస్డ్ ఫుడ్, కూల్‌డ్రింక్స్ తదితర ఆహార అలవాట్లు దేశ భవిష్యత్తు అయిన బాలలపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయి. INDలో 11-17ఏళ్ల మధ్య పిల్లల్లో ఊబకాయం పెరిగి USను దాటి 2వ స్థానానికి చేరినట్లు ఒబెసిటీ అట్లాస్-2026 పేర్కొంది. 5-9 వయసు వారిలో 1.49కోట్లు, 10-19 ఏళ్ల వారిలో 2.6కోట్ల మంది అధిక బరువుతో ఉన్నట్లు చెప్పింది. 74% పిల్లలు శారీరక శ్రమ లేకే బరువు పెరుగుతున్నారు. అటు చైనా తొలిస్థానంలో ఉంది.

News March 5, 2026

సెమీస్‌లో టీమ్‌గా రాణిస్తారా?

image

T20WC: ఈరోజు ఇంగ్లండ్‌తో సెమీస్‌లో భారత్ వన్ మ్యాన్ షోలపై ఆధారపడకుండా జట్టుగా రాణించాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. బ్యాటింగ్, బౌలింగ్ విభాగాల్లో ఇప్పటివరకు దాదాపు అన్ని మ్యాచుల్లో ఎవరో ఒకరు రాణిస్తూ జట్టును ఆదుకుంటున్నారు. ఈసారి భారత్ ఆ తప్పు చేయొద్దంటున్నారు. వాంఖడేలో షార్ట్ బౌండరీస్‌ను అడ్వాంటేజ్‌గా తీసుకొని బ్యాటర్లు సమష్టిగా రాణించాలని.. బౌలింగ్, ఫీల్డింగ్‌లోనూ తడబడకూడదని కోరుకుంటున్నారు.

News March 5, 2026

రేపటి నుంచి భగభగలు!

image

తెలుగు రాష్ట్రాల్లో రేపటి నుంచి ఎండలు తీవ్రరూపం దాల్చనున్నాయి. కోస్తా, రాయలసీమ ప్రాంతాల్లో టెంపరేచర్ 38°C దాటుతుందని వాతావరణశాఖ హెచ్చరించింది. నిన్న కర్నూలులో అత్యధికంగా 38.5°C నమోదైంది. అటు తెలంగాణలోని ములుగు, భూపాలపల్లి, భద్రాద్రి, సూర్యాపేట, నల్గొండ, ఖమ్మం జిల్లాల్లో 40+డిగ్రీల టెంపరేచర్ నమోదవుతుందని HYD వాతావరణ కేంద్రం హెచ్చరించింది. ఈ జిల్లాలకు ఆరెంజ్, మిగతా జిల్లాలకు ఎల్లో అలర్ట్ ఇచ్చింది.