News December 17, 2024

జోగి రమేశ్‌ను చూసి షాక్‌కు గురయ్యా: పార్థసారథి

image

AP: నూజివీడులో గౌతు లచ్చన్న విగ్రహావిష్కరణకు జోగి రమేశ్ దురుద్దేశంతో వచ్చి ఉండొచ్చని మంత్రి పార్థసారథి అన్నారు. ‘నన్ను ఆదరించిన TDP కార్యకర్తల మనోభావాలు దెబ్బతిన్నందుకు సారీ. ఇది పార్టీలకతీతంగా గౌడ సంఘం ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమం. ఆ సమయంలో జోగి రమేశ్‌ను చూసి షాక్‌కు గురయ్యాను. ఆయనకు, నాకు వ్యక్తిగత సంబంధాలు లేవు. భవిష్యత్తులో ఇలాంటివి జరగకుండా చూసుకుంటా’ అని ప్రెస్‌మీట్‌లో పార్థసారథి చెప్పారు.

Similar News

News November 21, 2025

మొక్కలకు బోరాన్ ఎందుకు అవసరం?

image

బోరాన్ అనే ఈ సూక్ష్మధాతు మూలకం బోరిక్ యాసిడ్ స్థితిలో మొక్కలకు అందుబాటులోకి వస్తుంది. ఇది మొక్కల్లో, నేలల్లో నిశ్చల స్థితిలో ఉంటుంది. మొక్క ఆకులలో తయారయ్యే ఆహారాన్ని అన్ని భాగాలకు చేరవేయడంలో బోరాన్ కీలక పాత్ర పోషిస్తుంది. మొక్కల సంపర్క ప్రక్రియలో ఉపయోగపడే పుప్పొడి ఉత్పత్తిలో, పుప్పొడి కణాల ఎదుగుదలను నియంత్రిస్తూ విత్తన, పండ్ల ఎదుగుదలను నిలువరిస్తుంది. మొక్క కాల్షియం గ్రహించడానికి తోత్పడుతుంది.

News November 21, 2025

మొక్కల్లో బోరాన్ లోపిస్తే ఏం జరుగుతుంది?

image

బోరాన్ లోపం వల్ల మొక్కలో పెరిగే భాగాలైన వేర్లు, లేత చిగురు, లేత కొమ్మలు, లేత పత్రాలపై ప్రభావం పడుతుంది. ఈ లోపానికి సరైన మొక్కల్లో చిగుర్లు వికృతాకారంలో ఉంటాయి. ఆకులు చిన్నవిగా ఉండి విచ్చుకోకుండా కుచించుకుపోయి కాండపు కణుపు మీద ఉంటాయి. దీని వల్ల మొక్క కురచగా, గుబురుగా కనిపిస్తుంది. చిగుర్ల నుంచి కొమ్మలు ఏర్పడతాయి. లేత ఆకులు ఈనెల మధ్య భాగాలు పసుపు/తెలుపు చారలుగా మారతాయి. తర్వాత ముడుచుకుపోతాయి.

News November 21, 2025

సీఎం మార్పు ప్రచారంపై డీకే శివకుమార్ క్లారిటీ

image

కర్ణాటకలో సీఎం మార్పు ప్రచారానికి Dy.CM డీకే శివకుమార్ తెరదించారు. అలాంటి మార్పేమీ ఉండదని స్పష్టం చేశారు. సీఎం సిద్ధరామయ్య ఐదేళ్లు పూర్తిగా పనిచేస్తారని, అందుకు తానూ సహకరిస్తానన్నారు. తామిద్దరం హైకమాండ్ ఆదేశాలను పాటిస్తామన్నారు. ‘అందరికీ మంత్రిపదవి అవకాశం రావాలని సీఎం యోచిస్తున్నారు. అందుకే క్యాబినెట్‌లో మార్పులు చేయాలనుకుంటున్నారు. ఈక్రమంలోనే పార్టీ MLAలు ఢిల్లీకి వచ్చారు’ అని తెలిపారు.