News March 15, 2025

భారత్‌కు రావొద్దని నన్ను బెదిరించారు: వరుణ్ చక్రవర్తి

image

2021 టీ20 వరల్డ్ కప్‌లో ప్రదర్శన అనంతరం తనకు బెదిరింపు ఫోన్ కాల్స్ వచ్చేవని భారత స్పిన్నర్ వరుణ్ చక్రవర్తి ఓ ఇంటర్వ్యూలో తెలిపారు. ‘స్వదేశానికి రావొద్దని నన్ను బెదిరించారు. చెన్నై వచ్చాక కూడా ఎవరో నన్ను ఇంటివరకూ ఫాలో అయ్యారు. అది నాకు చాలా కష్టమైన దశ. నమ్మకంతో జట్టుకు సెలక్ట్ చేస్తే దాన్ని నిలబెట్టుకోలేకపోయానన్న బాధతో డిప్రెషన్‌లోకి వెళ్లిపోయాను. చాలా బాధపడ్డాను’ అని గుర్తుచేసుకున్నారు.

Similar News

News March 15, 2025

స్టాలిన్ ప్రభుత్వంపై కిషన్ రెడ్డి ఫైర్

image

త్రిభాషా విధానాన్ని వ్యతిరేకిస్తున్న స్టాలిన్ ప్రభుత్వంపై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఫైరయ్యారు. ఈడీ సోదాల నుంచి ప్రజల దృష్టిని మరల్చేందుకు కేంద్రంపై విమర్శలకు దిగిందని అన్నారు. బడ్జెట్ పత్రాల్లో రూపీ(₹) చిహ్నం తొలగిస్తూ నిర్ణయం తీసుకోవడం రాజ్యాంగ సంస్థలను ఉల్లంఘించడమేనని ఫైరయ్యారు. నియోజకవర్గాల పునర్విభజనలో దక్షిణాది రాష్ట్రాలకు ఎలాంటి అన్యాయం జరగబోదని ప్రధాని మోదీ, అమిత్ షా చెప్పారన్నారు.

News March 15, 2025

గ్రీన్‌కార్డు హోల్డర్స్ శాశ్వత పౌరులేమీ కాదు: జేడీ వాన్స్

image

గ్రీన్ కార్డు సిటిజన్స్ అమెరికా శాశ్వత పౌరులేమీ కాదని ఆ దేశ ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ అన్నారు. USAకు వారివల్ల ప్రమాదం ఉందని తెలిస్తే వారినీ దేశం నుంచి బహిష్కరిస్తామన్నారు. గ్రీన్‌కార్డు హోల్డర్స్ ఇమిగ్రేషన్ పాలసీకి భంగం కలిగించనంత వరకే వారు దేశంలో ఉండేలా హక్కు ఉందని దానిని అతిక్రమిస్తే చర్యలు తప్పవని తెలిపారు. అధ్యక్షుడు ఎవరినైనా USAనుంచి పంపించాలనుకుంటే వెళ్లాల్సిందేనని చెప్పారు.

News March 15, 2025

ఇవాళ అసెంబ్లీకి సీఎం రేవంత్

image

TG: సీఎం రేవంత్ రెడ్డి ఇవాళ అసెంబ్లీలో గవర్నర్ ప్రసంగానికి ధన్యావాదాలు తీర్మానంపై సమాధానం ఇవ్వనున్నారు. ఉ.10 గంటలకు ఉభయసభలు ప్రారంభం కానున్నాయి. గవర్నర్‌పై విపక్షాల విమర్శల నడుమ ఆయన ఎలా స్పందిస్తారనేది ఆసక్తికరంగా మారింది. మరోవైపు ఇవాళ పొట్టి శ్రీరాములు యూనివర్సిటీ పేరు మార్పుపై సభలో బిల్లును ప్రవేశపెట్టనున్నారు. సురవరం ప్రతాపరెడ్డి తెలుగు యూనివర్సిటీగా పేరు మార్చనున్నట్లు సమాచారం.

error: Content is protected !!