News March 26, 2025
నేనెప్పటికీ నాగ్ అభిమానినే: సౌబిన్ షాహిర్

లోకేశ్ తెరకెక్కిస్తున్న ‘కూలీ’ సినిమాలో నాగార్జునతో కలిసి నటించడం ఎంతో గర్వంగా ఉందని ‘మంజుమల్ బాయ్స్’ ఫేమ్ సౌబిన్ షాహిర్ చెప్పుకొచ్చారు. ‘కూలీ సెట్స్‌లో నేను ఆయనతో గడిపిన క్షణాలు ఎప్పటికీ గుర్తుండిపోతాయి. నాగ్‌ను చూస్తుంటే స్టైల్, స్వాగ్ ఆయనే కనిపెట్టారనిపిస్తుంది. సెట్స్ నుంచి వచ్చాక అభిమానిగా ఆయన గురించి చెప్పకుండా ఉండలేకపోతున్నా. ఎప్పటికీ ఆయన అభిమానినే’ అని షాహిర్ సెల్ఫీ ఫొటోను షేర్ చేశారు.
Similar News
News March 29, 2025
బుమ్రా ఎప్పుడొస్తారో చెప్పలేం: జయవర్ధనే

పేసర్ జస్ప్రీత్ బుమ్రా బాగా కోలుకున్నారని ముంబై ఇండియన్స్ కోచ్ మహేల జయవర్ధనే తెలిపారు. అయితే ఎంట్రీ ఎప్పుడన్నది చెప్పలేమని తెలిపారు. ‘బుమ్రాను ఫలానా మ్యాచ్‌లోపు తీసుకురావాలన్నదేమీ మేం పెట్టుకోలేదు. తన రోజూవారీ వర్కవుట్స్‌ను క్రమం తప్పకుండా ఏ సమస్యా లేకుండా పూర్తి చేస్తున్నాడు. ఎప్పటి నుంచి ఆడొచ్చనదానిపై NCA ఏ క్లారిటీ ఇవ్వలేదు’ అని పేర్కొన్నారు. BGT సమయంలో బుమ్రాకు వెన్నెముక గాయమైంది.
News March 29, 2025
ఎంపురాన్‌లో ఆ సీన్స్ కట్ చేస్తున్నాం: నిర్మాత

మోహన్‌లాల్ హీరోగా తెరకెక్కిన ‘ఎల్2: ఎంపురాన్’ సినిమాపై విమర్శలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో దాని నిర్మాత గోకులం గోపాల్ స్పందించారు. ప్రేక్షకుల మనోభావాలను దెబ్బతీసేలా ఉన్న సన్నివేశాలను తొలగించాలని దర్శకుడు పృథ్వీరాజ్‌కు సూచించినట్లు తెలిపారు. ఎంపురాన్ సినిమా ప్రారంభంలో వచ్చే కొన్ని సన్నివేశాలతోపాటు ఓవరాల్‌గా కథను ఒక వర్గాన్ని కించపరిచేలా తీశారంటూ విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
News March 29, 2025
మండుతున్న ఎండలు.. 150 మండలాల్లో 40+ డిగ్రీలు

AP: రాష్ట్రంలో వడగాలులు, ఎండలు ఠారెత్తిస్తున్నాయి. ఇవాళ 150కిపైగా మండలాల్లో 40 డిగ్రీలపైన ఉష్ణోగ్రతలు నమోదైనట్లు IMD వెల్లడించింది. కోస్తాంధ్ర, రాయలసీమ జిల్లాల్లో ప్రభావం ఎక్కువగా ఉన్నట్లు పేర్కొంది. కొమరోలు, నంద్యాల, కమలాపురంలో 42.5, రుద్రవరం, అనకాపల్లిలో 42, కోసిగి, తాడిమర్రిలో 41 డిగ్రీలు రికార్డయినట్లు పేర్కొంది. మధ్యాహ్నం వేళ అత్యవసరమైతే తప్ప బయటికి రావొద్దని సూచించింది.