News September 22, 2025
ప్రేక్షకులకు ఎల్లప్పుడూ కృతజ్ఞుడినై ఉంటా: చిరు

ఇండస్ట్రీకి పరిచయమై నేటికి 47ఏళ్లు పూర్తయినట్లు మెగాస్టార్ చిరంజీవి ట్వీట్ చేశారు. ‘‘కొణిదెల శివ శంకర వరప్రసాద్ అనే నేను 22 SEP 1978న ‘ప్రాణం ఖరీదు’ చిత్రం ద్వారా మీకు పరిచయమై నేటితో 47ఏళ్లు పూర్తయ్యాయి. ఈ చిత్రం ద్వారా నాకు నటుడిగా ప్రాణం పోసి, మీ అన్నయ్యగా, కొడుకుగా, మీ కుటుంబ సభ్యుడిగా, మెగాస్టార్‌గా అనుక్షణం నన్ను ఆదరించిన తెలుగు ప్రేక్షకులకు ఎల్లప్పుడూ కృతజ్ఞుడినై ఉంటా’ అని రాసుకొచ్చారు.
Similar News
News September 22, 2025
ఎయిర్‌ఇండియా విమానంలో కలకలం

బెంగళూరు నుంచి వారణాసి వెళ్తున్న ఎయిర్‌ఇండియా ఫ్లైట్లో ఓ ప్రయాణికుడు కాక్‌పిట్ డోర్ తెరిచేందుకు ప్రయత్నించడంతో కలకలం రేగింది. దీనిపై ఎయిర్‌ఇండియా స్టేట్‌మెంట్ విడుదల చేసింది. ప్రయాణికుడు టాయిలెట్ అనుకుని పొరపాటున కాక్‌పిట్ డోర్ తీయడానికి ప్రయత్నించాడని తెలిపింది. భద్రతా పరమైన సమస్య తలెత్తలేదని ప్రకటించింది. అతడిని CISF అదుపులోకి తీసుకుంది.
News September 22, 2025
ARCIలో ప్రాజెక్ట్ సైంటిస్ట్ పోస్టులు

ఇంటర్నేషనల్ అడ్వాన్స్‌డ్ రీసెర్చ్ సెంటర్ పౌడర్ మెటలార్జీ అండ్ న్యూ మెటీరియల్స్(<
News September 22, 2025
యువరాజ్ శిక్షణలో రాటుదేలి.. బ్రహ్మోస్‌లా విరుచుకుపడ్డాడు

టీమ్ ఇండియా చిచ్చరపిడుగు అభిషేక్ శర్మ నిన్న పాకిస్థాన్‌పై ‘బ్రహ్మోస్’ క్షిపణిలా విరుచుకుపడ్డారు. గతంలో పాకిస్థాన్‌కు చుక్కలు చూపించిన యువరాజ్ సింగ్ శిక్షణలో రాటుదేలిన అభిషేక్.. పాక్ బౌలర్లను షేక్ చేశారు. అద్భుతమైన ఆటతీరుతో పాక్‌కు మ్యాచును దూరం చేశారు. అంతేకాదు ఆ జట్టు బౌలర్లు కవ్విస్తే తగ్గేదే లే అంటూ బ్యాటుతోనే జవాబిచ్చారు. పాక్‌పై లీగ్ స్టేజీలోనూ అభిషేక్ (13 బంతుల్లో 31) అదరగొట్టారు.