News October 15, 2025

రేపు ఏపీలో పర్యటిస్తున్నా: మోదీ

image

గురువారం ఏపీలో పర్యటించనున్నట్లు ప్రధాని మోదీ ట్వీట్ చేశారు. ముందుగా శ్రీశైలంలోని భ్రమరాంబ మల్లికార్జునస్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించనున్నట్లు తెలిపారు. అనంతరం కర్నూలులో రూ.13,400 కోట్ల విలువైన అభివృద్ధి, శంకుస్థాపన కార్యక్రమాల్లో పాల్గొంటానని పేర్కొన్నారు. అంతకుముందు అంతర్జాతీయ యోగా దినోత్సవంలో పాల్గొనేందుకు ప్రధాని ఏపీలో పర్యటించిన సంగతి తెలిసిందే.

Similar News

News October 15, 2025

కామన్‌వెల్త్ గేమ్స్: ఈ విషయాలు తెలుసా?

image

కామన్‌వెల్త్ <<18015617>>క్రీడలు<<>> 1930లో ‘బ్రిటిష్ ఎంపైర్ గేమ్స్’ పేరుతో కెనడాలోని హామిల్టన్‌లో తొలిసారి జరిగాయి. ఆ తర్వాత బ్రిటిష్ ఎంపైర్ అండ్ కామన్‌వెల్త్ గేమ్స్(1954-1966), బ్రిటిష్ కామన్‌వెల్త్ గేమ్స్(1970-1974)గా మారాయి. 1978 నుంచి కామన్‌వెల్త్ గేమ్స్‌గా పిలుస్తున్నారు. బ్రిటిష్ పాలన నుంచి స్వతంత్రం పొందినవి ఇందులో సభ్యదేశాలుగా ఉన్నాయి. 2022లో ఇందులో 53 సభ్యదేశాలు ఉండగా 72 దేశాలు క్రీడల్లో పాల్గొన్నాయి.

News October 15, 2025

నవంబర్ నుంచి క్షేత్రస్థాయిలో తనిఖీలు: CBN

image

AP: పథకాల అమలుపై నవంబర్ నుంచి క్షేత్రస్థాయిలో తనిఖీ చేస్తానని CM CBN వెల్లడించారు. ‘సుపరిపాలన అందిస్తున్నాం. సంక్షేమ పథకాలు, GST సంస్కరణల లబ్ధిని ప్రజల్లోకి తీసుకెళ్లాలి. అధికారులు థియేటర్లలో స్లైడ్స్ ప్రదర్శించాలి. టెక్నాలజీ డేటాను ఆడిట్ చేసి ప్రజల సంతృప్తి స్థాయి తెలుసుకుంటా. అధికారులిచ్చే సమాచారానికి వాస్తవాలకు పొంతన ఉండాలి’ అని సూచించారు. కొన్ని పార్టీల కుట్రలను టెక్నాలజీతో బయట పెట్టామన్నారు.

News October 15, 2025

గూగుల్ డేటా సెంటర్‌కు పోల’వరం’!

image

విశాఖలో ఏర్పాటు చేయబోయే గూగుల్ డేటా సెంటర్‌కు భారీ స్థాయిలో నీరు అవసరమని నిపుణులు చెబుతున్నారు. ఏడాదికి 1 టీఎంసీ జలాలు అవసరం అవుతాయని అంటున్నారు. అయితే పోలవరం లెఫ్ట్ మెయిన్ కాలువ ద్వారా విశాఖకు ఏడాదికి 23.44 TMCల నీరు సరఫరా కానుంది. ఆ ప్రాజెక్టు 2028 నాటికి పూర్తి కానుంది. దీనివల్ల నీటి సమస్య తీరే ఛాన్స్ ఉంది. ఇక గ్రీన్ హైడ్రోజన్, సోలార్, విండ్ పవర్.. డేటా సెంటర్ విద్యుత్ అవసరాలను తీర్చనున్నాయి.