News December 28, 2024

గేమ్ ఛేంజర్ ట్రైలర్ రిలీజ్ చేయకపోతే ఆత్మహత్య చేసుకుంటా: అభిమాని

image

రామ్ చరణ్ వీరాభిమాని సూసైడ్ లెటర్ రాయడం కలకలం రేపింది. త్వరలో గేమ్ ఛేంజర్ ట్రైలర్ విడుదల చేయాలని, లేదంటే ఆత్మహత్య చేసుకుంటానని అందులో పేర్కొన్నాడు. ‘సినిమాకు ఇంకా 13రోజులే ఉంది. అభిమానుల ఎమోషన్స్‌ను పట్టించుకోవడం లేదు. ఈనెలాఖరు లేదా JAN 1 వరకు రిలీజ్ చేయకపోతే నేను ఆత్మహత్యకు పాల్పడతాను’ అని రాసుకొచ్చాడు. కాగా దీనిపై స్పందించిన మేకర్స్ ప్రోగ్రామ్స్ ప్లాన్ ప్రకారం జరుగుతాయని చెప్పినట్లు సమాచారం.

Similar News

News December 18, 2025

తెలుగు రాష్ట్రాల్లో సీఈసీ పర్యటన

image

CEC జ్ఞానేశ్ కుమార్ 3 రోజులపాటు తెలుగు రాష్ట్రాల్లో పర్యటించనున్నారు. రేపు 12PMకు HYD చేరుకోనున్న ఆయన అక్కడి నుంచి శ్రీశైలం వెళతారు. 20న మల్లికార్జున స్వామివారిని దర్శించుకుని మహా హారతి కార్యక్రమంలో పాల్గొంటారు. 21న HYD రవీంద్ర భారతి ఆడిటోరియంలో TG BLOలతో సమావేశమై ఎన్నికల ప్రక్రియపై దిశానిర్దేశం చేస్తారు. కాగా ఈ పర్యటనలో ఆయన గోల్కొండ, చార్మినార్ వంటి చారిత్రక ప్రదేశాలను సందర్శించే అవకాశం ఉంది.

News December 18, 2025

హైవేలపై QR కోడ్స్.. ఎందుకంటే?

image

నేషనల్ హైవేలపై ప్రయాణాన్ని మరింత సులభతరం చేసేందుకు NHAI టెక్నాలజీని వాడనుంది. ఇందులో భాగంగా రోడ్డు పక్కన QR కోడ్ బోర్డులను ఏర్పాటు చేయనుంది. ప్రస్తుతం దీనిని పైలట్ ప్రాజెక్టుగా బెంగళూరు-నెలమంగళ (NH-48), బెంగళూరు-కోలార్-ముల్బాగల్ (NH-75) మార్గాల్లో అందుబాటులోకి తెచ్చింది. QR కోడ్ స్కాన్ చేస్తే ప్రాజెక్ట్ వివరాలు, దగ్గరున్న టోల్ & ఫీజు, సౌకర్యాలు & అత్యవసర సేవల గురించి తెలుస్తుంది.

News December 18, 2025

రోడ్డు ప్రమాద బాధితులకు సాయం చేస్తే రూ.25వేలు: గడ్కరీ

image

కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ కీలక ప్రకటన చేశారు. రోడ్డు ప్రమాద బాధితులను ఆస్పత్రికి తీసుకెళ్లిన వారిని ‘రాహ్‌వీర్’(హీరో ఆఫ్ ది రోడ్)గా గుర్తించి ₹25వేలు రివార్డు ఇస్తామని వెల్లడించారు. పోలీసులు, లీగల్ భయాలు లేకుండా బాధితులకు సాయం చేయాలని పిలుపునిచ్చారు. సకాలంలో సాయం అందిస్తే ఏటా దాదాపు 50వేల మందిని కాపాడవచ్చని చెప్పారు. బాధితులకు ఏడు రోజుల చికిత్సకు ₹1.5 లక్షలు ప్రభుత్వమే ఇస్తుందని పేర్కొన్నారు.