News March 20, 2024
పవన్ ఎంపీగా బరిలో ఉంటే పిఠాపురంలో నేనే పోటీ చేస్తా: వర్మ

AP: అమిత్ షా సూచిస్తే కాకినాడ ఎంపీగా పోటీ చేస్తానని, పిఠాపురంలో ఉదయ్ బరిలో ఉంటారన్న పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలపై టీడీపీ నేత ఎస్వీఎస్ఎన్ వర్మ స్పందించారు. ‘పొత్తులో భాగంగా కూటమి గెలుపు కోసం పని చేయాల్సి ఉంటుంది. చంద్రబాబు మాటకు కట్టుబడి పవన్ గెలుపు కోసం కృషి చేస్తా. ఒకవేళ ఆయన కాకినాడ నుంచి ఎంపీగా పోటీ చేస్తే పిఠాపురం అసెంబ్లీ స్థానంలో నేనే బరిలో ఉంటా’ అని తెలిపారు.
Similar News
News September 8, 2025
విటమిన్ల కోసం ఇవి తినండి!

విటమిన్ A- క్యారెట్లు, కాలేయం. B1 – తృణధాన్యాలు, చిక్కుళ్లు. B2 – పాలు, గుడ్లు, పాలకూర. B3 – చికెన్, వేరుశనగ. B5 – అవకాడో, గుడ్లు. B6 – అరటిపండు, సాల్మన్ చేప, ఆలుగడ్డలు. B7 – గుడ్లు, బాదం, కాలీఫ్లవర్. B9 – ఆకుకూరలు, పప్పులు, సిట్రస్. B12 – చేపలు, మాంసం, పాల ఉత్పత్తులు. విటమిన్ D – సూర్యకాంతి, చేపలు, పాలు. K- కాలే, బ్రోకలీ, సోయాబీన్. E – పొద్దుతిరుగుడు గింజలు, బాదం. C – నారింజ, జామ. SHARE IT
News September 8, 2025
బదిలీలపై చివరి దశకు కసరత్తు!

AP: ఆల్ఇండియా సర్వీసెస్ అధికారుల బదిలీలపై కసరత్తు చివరి దశకు చేరినట్లు తెలుస్తోంది. ఈ అంశంపై నిన్న CS, DGP, CMO అధికారులతో CM చంద్రబాబు సుదీర్ఘంగా చర్చించినట్లు ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. JCల నుంచి స్పెషల్ చీఫ్ సెక్రటరీలు.. SPల నుంచి DIG, IGల వరకు కీలక పోస్టుల్లో కొత్త అధికారులు వచ్చే అవకాశముందని చెబుతున్నాయి. సరైన స్థానంలో సరైన అధికారి అనే కాన్సెప్ట్ కోసం CM కసరత్తు చేస్తున్నారని పేర్కొంటున్నాయి.
News September 8, 2025
CM రేవంత్కు సుప్రీంకోర్టులో ఊరట

TG: CM రేవంత్ రెడ్డికి సుప్రీంకోర్టులో ఊరట లభించింది. ‘BJP అధికారంలోకి వస్తే రిజర్వేషన్లు తొలగిస్తుంది’ అని గతేడాది మే 4న కొత్తగూడెం సభలో ఆయన చేసిన వ్యాఖ్యలపై TG BJP వేసిన పిటిషన్ను SC డిస్మిస్ చేసింది. కోర్టును రాజకీయ యుద్ధ క్షేత్రాలుగా మార్చొద్దని CJI గవాయ్ నేతృత్వంలోని త్రిసభ్య ధర్మాసనం అసహనం వ్యక్తం చేసింది. కాగా ఈ పిటిషన్ను గతంలో HC కొట్టేయగా BJP నేత కాసం వెంకటేశ్వర్లు SCలో సవాల్ చేశారు.