News November 8, 2024
నా పోరాటం కొనసాగిస్తా: కేఏ పాల్

AP: తిరుమలను <<14559672>>కేంద్ర పాలిత ప్రాంతం<<>> చేయాలంటూ ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు KA పాల్ దాఖలు చేసిన పిటిషన్ను సుప్రీంకోర్టు కొట్టివేసిన సంగతి తెలిసిందే. దీనిపై KA పాల్ స్పందించారు. ‘తిరుమల వ్యవహారంపై నా పోరాటం ఆపను. మరోసారి సుప్రీంకోర్టును ఆశ్రయిస్తా. తిరుమలలో గొడవలు ఆగాలంటే కేంద్రం పాలిత ప్రాంతం చేయాల్సిందే. నా పిటిషన్ను విచారించిన ధర్మాసనానికి కృతజ్ఞతలు’ అని ఆయన వ్యాఖ్యానించారు.
Similar News
News November 20, 2025
జూలేకల్ ఘటనపై కలెక్టర్ విచారణ

వడ్డేపల్లి మండలం జూలేకల్లోని ఓ ప్రైవేటు పాఠశాలలో మూడో తరగతి బాలుడిని ఇసుకలో మోకాళ్లపై నడిపించిన ఘటనపై కలెక్టర్ బి.ఎం.సంతోష్ సీరియస్ అయ్యారు. ఈ ఘటనపై తక్షణమే విచారణ చేపట్టాలని ఆదేశించారు. స్థానిక సంస్థల ఎన్నికల ఏర్పాట్ల సమీక్ష అనంతరం ఆయన నేరుగా పాఠశాలకు వెళ్లి విచారించనున్నట్లు సమాచారం. సంబంధిత శాఖ అధికారులు కూడా చర్యలకు సిద్ధమయ్యారు.
News November 20, 2025
రైల్వేలో 5,810 ఉద్యోగాలు.. దరఖాస్తు గడువు పొడిగింపు

RRB 5,810 NTPC పోస్టుల దరఖాస్తు గడువును పొడిగించింది. నేటితో అప్లై గడువు ముగియగా.. ఈనెల 27వరకు పొడిగించింది. ఫీజు చెల్లించడానికి ఈ నెల 29 వరకు ఛాన్స్ ఇచ్చింది. డిగ్రీ అర్హతతో 18- 33ఏళ్లు గల వారు అప్లై చేసుకోవచ్చు. CBT, స్కిల్ టెస్ట్, డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ టెస్ట్ ద్వారా ఎంపిక చేస్తారు. *మరిన్ని ఉద్యోగాల కోసం <<-se_10012>>జాబ్స్ <<>>కేటగిరీకి వెళ్లండి.
News November 20, 2025
బిహార్ ముఖ్యమంత్రిగా నితీశ్ టర్మ్స్

బిహార్ రాజకీయ భీష్ముడిగా పేరొందిన నితీశ్ ఇవాళ 10వ సారి సీఎంగా ప్రమాణస్వీకారం చేయబోతున్నారు. ఆయన తొలిసారి 2000 సం.లో సీఎం అయ్యారు. అప్పటి నుంచి బీజేపీ, ఆర్జేడీ, కాంగ్రెస్, లోక్ జన్శక్తి.. ఇలా ఎన్నో పార్టీలతో కలిసి సీఎం పీఠాన్ని అధిరోహించారు.
*2000 మార్చి 3- 2000 మార్చి 7 *2005-2010
*2010-2014 *2015 FEB 22- 2015 NOV 19 *2015-2017 *2017-2020 *2020-2022 *2022-24 *2024-2025 NOV.


