News August 14, 2024
మీ కోసం ఉన్నదంతా పెట్టేస్తా: రామ్ పోతినేని

రేపు ‘డబుల్ ఇస్మార్ట్’ మూవీ రిలీజ్ కానున్న నేపథ్యంలో అభిమానులను ఉద్దేశించి హీరో రామ్ పోతినేని ట్వీట్ చేశారు. ‘చేతనైనంతా.. కుదిరినంతా.. వీలైనంతా.. కాదు. మీ కోసం ఎప్పుడూ ఉన్నదంతా పెట్టేస్తా. సినిమా తీస్తున్నప్పుడు మాకు కలిగిన మెంటల్ మ్యాడ్‌నెస్‌ను మీరూ పొందుతారని భావిస్తున్నాం. మరికొన్ని గంటల్లో డబుల్ ఇస్మార్ట్ మీది కానుంది’ అని పేర్కొన్నారు.
Similar News
News August 30, 2025
ధోనీకి స్పెషల్ ఆఫర్ ఇచ్చిన BCCI?

టీమ్ ఇండియా మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనీకి బీసీసీఐ ఓ స్పెషల్ ఆఫర్ ఇచ్చినట్లు క్రిక్ బ్లాగర్ పేర్కొంది. 2021 టీ20 వరల్డ్ కప్‌కు ధోనీ టీమ్ ఇండియా మెంటర్‌గా వ్యవహరించిన విషయం తెలిసిందే. ఈసారి అలా పార్ట్ టైమ్ కాకుండా ఫుల్ టైమ్ మెంటర్‌గా ఉండాలని ధోనీని కోరినట్లు బీసీసీఐ ప్రతినిధి తెలిపారని వివరించింది. సీనియర్, జూనియర్ జట్లు సహా మహిళల టీమ్స్‌కూ MSDని మెంటర్‌గా వ్యవహరించాలని కోరినట్లు తెలిపింది.
News August 30, 2025
ఎమ్మెల్సీలుగా ప్రొ.కోదండరాం, అజహరుద్దీన్

TG: గవర్నర్ కోటా ఎమ్మెల్సీలుగా ప్రొ.కోదండరాం, అజహరుద్దీన్ క్యాబినెట్ ఖరారు చేసింది. ఇవాళ జరిగిన భేటీలో వీరిద్దరి పేర్లకు ఆమోదం తెలిపింది. గతంలో ప్రొ.కోదండరాం, అమీర్ అలీఖాన్‌ను గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీలుగా నియమించగా, ఇటీవల వారిద్దరి నియామకాన్ని<<17393463>> సుప్రీంకోర్టు<<>> రద్దు చేసిన సంగతి తెలిసిందే. అమీర్ అలీఖాన్ స్థానంలో అజహరుద్దీన్‌కు అవకాశం కల్పించారు.
News August 30, 2025
ట్రెండింగ్: TRUMP IS DEAD

X (ట్విటర్)లో TRUMP IS DEAD అనే హ్యాష్‌ట్యాగ్ ట్రెండ్ అవుతోంది. ట్రంప్ వైట్‌హౌస్‌లో కనిపించకపోవడంతో కొందరు X వేదికగా ఈ పోస్టులు చేస్తున్నారు. ట్రంప్ CVI వ్యాధితో బాధపడుతున్నట్లు ఇటీవల వార్తలు వచ్చాయి. దీనికి తోడు దేశంలో ‘టెర్రిబుల్ ట్రాజెడీ’ సంభవిస్తే తాను అధ్యక్ష బాధ్యతలకు సిద్ధంగా ఉన్నట్లు వైస్ ప్రెసిడెంట్ వాన్స్ వ్యాఖ్యానించడం చర్చనీయాంశంగా మారింది. అయితే ఈ రూమర్లను వైట్‌హౌస్ ఖండించింది.