News December 21, 2024

అనుమతి ఇస్తే ఇప్పుడే శ్రీతేజ్‌ను కలుస్తా: బన్నీ

image

TG: పోలీసులు ఇప్పుడు అనుమతి ఇస్తే వెంటనే ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న శ్రీతేజ్‌ను వెళ్లి పరామర్శిస్తానని అల్లు అర్జున్ చెప్పారు. కోర్టులో కేసు ఉండటం వల్ల కలవలేకపోతున్నానని చెప్పారు. అతను తన ఫ్యాన్ అని, కలవకుండా ఎందుకు ఉంటానన్నారు. శ్రీతేజ్‌ను పరామర్శించడానికి తాను వెళ్లలేకపోయినా తండ్రి అల్లు అరవింద్, తన టీం ఇతరులను బాలుడి వద్దకు పంపి ఆరోగ్య పరిస్థితి గురించి తెలుసుకున్నట్లు తెలిపారు.

Similar News

News December 22, 2024

తీవ్ర వరదలు.. కటిక కరవు

image

గ్లోబల్ వార్మింగ్ కారణంగా రానున్న సంవత్సరాల్లో కొన్ని రాష్ట్రాలు తీవ్ర వరద, మరికొన్ని తీవ్రమైన కరవును ఎదుర్కోనున్నాయి. ఐఐటీ గువాహటి, ఐఐటీ మండీ, CSTEP అధ్యయనంలో ఈ విషయాలు వెల్లడయ్యాయి. దేశవ్యాప్తంగా 51 జిల్లాలు అత్యధిక వరదలు, 91 జిల్లాలు తీవ్ర కరవు కేటగిరీలో ఉన్నాయంది. ఏపీలోని కృష్ణా, ప.గోదావరి, గుంటూరు జిల్లాలకు వరద ముప్పు, విశాఖ, కర్నూలు, ప్రకాశం జిల్లాలకు కరవు సమస్య పొంచిఉన్నట్లు తేలింది.

News December 22, 2024

ప్ర‌శ్నార్థ‌కంగా MVA మ‌నుగ‌డ!

image

మ‌హారాష్ట్ర‌లో విప‌క్ష మ‌హా వికాస్ అఘాడీ మ‌నుగ‌డ ప్ర‌శ్నార్థ‌కంగా క‌నిపిస్తోంది. అసెంబ్లీ ఎన్నిక‌ల్లో పొత్తుల వల్ల సొంత బలం కోల్పోయామన్న భావనలో 3 పార్టీలున్నాయి. ముఖ్యంగా శివ‌సేన UBT ముంబై న‌గ‌రంలో త‌న ప్రాభ‌వాన్ని కోల్పోయింది. దీంతో పున‌ర్వైభ‌వం కోసం కూట‌మికి దూరం జ‌రుగుతోంది. 2025లో జ‌ర‌గ‌నున్న బృహ‌న్ ముంబై మున్సిప‌ల్ కార్పొరేష‌న్ ఎన్నిక‌ల్లో ఒంట‌రిగా పోటీ చేయాల‌ని ఆ పార్టీ నిర్ణ‌యించింది.

News December 22, 2024

ఓపెన్ టెన్త్, ఇంటర్ పరీక్షలకు దరఖాస్తులు

image

AP: ఓపెన్ టెన్త్, ఇంటర్ పరీక్షలకు రేపటి నుంచి ఈ నెల 31 వరకు ఫీజు చెల్లించవచ్చని అధికారులు తెలిపారు. టెన్త్‌లో సబ్జెక్టుకు రూ.5తోపాటు ఎగ్జామ్ ఫీజు రూ.95, ఇంటర్‌లో సబ్జెక్టుకు రూ.5తోపాటు పరీక్ష ఫీజు రూ.150 చొప్పున చెల్లించాలన్నారు. సబ్జెక్టుకు రూ.25 ఫైన్‌తో జనవరి 4 వరకు, రూ.50 అపరాధ రుసుముతో 8వ తేదీ వరకు అవకాశం ఉంటుందని చెప్పారు.