News August 14, 2024
ప్రభాస్ ‘ఫౌజీ’లో నేను నటించట్లేదు: మృణాల్

ప్రభాస్ హీరోగా హను రాఘవపూడి దర్శకత్వంలో తెరకెక్కనున్న ‘ఫౌజీ’ సినిమాలో తాను నటించట్లేదని హీరోయిన్ మృణాల్ ఠాకూర్ స్పష్టం చేశారు. ‘ఫిల్మ్‌ఫేర్’ ఇన్‌స్టాగ్రామ్‌లో పెట్టిన పోస్ట్‌పై ఆమె కామెంట్ చేశారు. ఇందులో ప్రభాస్ సైనికుడి పాత్రలో కనిపిస్తారని ప్రచారం జరుగుతుండగా, ఈనెల 17న ఫస్ట్ లుక్ విడుదల చేస్తారని సమాచారం.
Similar News
News December 19, 2025
ఎల్లుండి నుంచి అకౌంట్లలోకి బోనస్ డబ్బులు

TG: రాష్ట్రంలో వరి సన్నాలు సాగు చేసిన రైతులకు బోనస్ ఇచ్చేందుకు ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. 24 లక్షల మంది రైతులకు బోనస్ కింద రూ.649 కోట్లు చెల్లించేందుకు ఆమోదం తెలిపింది. దీంతో సోమవారం నుంచి చెల్లింపులు మొదలవుతాయని అధికారులు చెబుతున్నారు. కాగా సన్నాలకు క్వింటాకు రూ.500 చొప్పున అదనంగా ఇస్తామని ప్రభుత్వం ప్రకటించిన సంగతి తెలిసిందే.
News December 19, 2025
రొనాల్డో బాడీ అదుర్స్.. VIRAL

పోర్చుగల్ ఫుట్‌బాల్ స్టార్ క్రిస్టియానో రొనాల్డో సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన ఫొటో ఇంటర్నెట్ను షేక్ చేస్తోంది. 40 ఏళ్ల వయసులో 8 ప్యాక్స్‌తో పాటు ఫుల్ ఫిట్‌గా ఉన్నారని నెటిజన్లు ఆశ్చర్యపోతున్నారు. డైట్, ఫిట్నెస్ పట్ల రొనాల్డో డెడికేషన్ అద్భుతం అని కొనియాడుతున్నారు. అతడి బాడీ ఫ్యాట్ పర్సెంటేజీ కేవలం 7% మాత్రమే ఉంటుంది.
News December 19, 2025
అత్యధిక గన్ లైసెన్సులు యూపీలోనే

ప్రపంచంలో ప్రతి 100 మందిలో ఐదుగురికి గన్స్ ఉన్నాయి. ఇండియాలో మాత్రం ఆ సంఖ్య చాలా తక్కువ. RTI ద్వారా అడిగిన దానికి స్పందనగా 2023 వరకు ఉన్న డేటాను MHA వెల్లడించింది. దేశంలో మొత్తం గన్ లైసెన్సులు 33-40 లక్షల వరకు ఉన్నాయి. UPలో 13.29 లక్షలు, J&Kలో 4-5 L, పంజాబ్‌లో 3.46 L, లైసెన్సులు ఉన్నాయి. బిహార్, మణిపుర్ వంటి హైసెన్సివిటీ రాష్ట్రాల్లోనూ ఆ సంఖ్య తక్కువే కావడం విశేషం. దక్షిణాదిలో 2 లక్షలే ఉన్నాయి.


