News April 4, 2024
చంద్రబాబు అబద్ధపు హామీలతో నేను పోటీ పడను: సీఎం జగన్

AP: తనకు పేదలపై ఉన్న ప్రేమ దేశంలో ఏ నాయకుడికీ లేదని సీఎం జగన్ తెలిపారు. ‘అన్ని వర్గాలకూ మంచి చేశాననే ఆత్మవిశ్వాసంతో ప్రజల ముందుకొచ్చాను. సాధ్యంకాని హామీలను నేను మేనిఫెస్టోలో పెట్టను. జగన్ అమలు చేయలేని ఏ పథకమూ.. చంద్రబాబే కాదు ఆయన జేజమ్మ కూడా అమలు చేయలేదు. ఆయన చెప్పే అబద్ధపు హామీలతో నేను పోటీ పడాలనుకోవడం లేదు. మోసపు వాగ్దానాలు చేయను. అబద్ధాలు చెప్పను’ అని స్పష్టం చేశారు.
Similar News
News October 19, 2025
దీపావళి రోజున లక్ష్మీ పూజ ఎందుకు చేయాలి?

దీపావళి రోజున లక్ష్మీదేవి భూలోకానికి వచ్చి, తన తేజస్సుతో అజ్ఞానమనే చీకటిని తరిమివేసి, భక్తులను అనుగ్రహిస్తుందని పురాణాలు చెబుతున్నాయి. అందుకే పండుగ రోజున దీపాలు పెట్టి అమ్మవారిని ఆహ్వానించాలనే ఆచారాన్ని మనం అనాదిగా పాటిస్తున్నాం. నేడు ఇలా దీపాలు వెలిగిస్తే అమ్మవారు మనపై అనుగ్రహం చూపి సంపదలు స్థిరంగా ఉండేలా చేస్తారని నమ్మకం. ఆర్థిక స్థితి మెరుగై, కుటుంబంలోని అడ్డంకులు తొలగిపోతాయని విశ్వసిస్తారు.
News October 19, 2025
పారిశ్రామికవేత్తలకు CM చంద్రబాబు శుభవార్త

AP: పారిశ్రామికవేత్తలకు CM చంద్రబాబు దీపావళి సందర్భంగా శుభవార్త చెప్పారు. పరిశ్రమలకు ప్రోత్సాహకాలు విడుదల చేసి ఆయా సంస్థలకు చేయూత ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నామన్నారు. ఆర్థిక ఇబ్బందులున్నా రూ.1500 కోట్ల పారిశ్రామిక ప్రోత్సాహకాలను తొలి విడతగా త్వరలోనే విడుదల చేయబోతున్నట్లు ట్వీట్ చేశారు. రాష్ట్రాన్ని పెట్టుబడులకు అత్యుత్తమ గమ్యస్థానంగా తీర్చిదిద్దడానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని పేర్కొన్నారు.
News October 19, 2025
భారీ జీతంతో NMDCలో ఉద్యోగాలు

NMDC లిమిటెడ్ 14 పోస్టులకు వేర్వేరుగా నోటిఫికేషన్లు విడుదల చేసింది. ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్, CGM, GM, డైరెక్టర్ తదితర పోస్టులు ఉన్నాయి. అన్ని పోస్టులకు OCT 21 ఆఖరు తేదీ కాగా.. డైరెక్టర్ పోస్టుకు OCT 27 లాస్ట్ డేట్. పోస్టును బట్టి ఇంజినీరింగ్ డిగ్రీ (మైనింగ్, మెకానికల్, ఎలక్ట్రికల్, సివిల్), PG, PG డిప్లొమా, MBA, MSc, ఎంటెక్, MSc జియోలజీ, CA/ICMA ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి.