News October 15, 2025
నేను ఎన్నికల్లో పోటీ చేయట్లేదు: ప్రశాంత్ కిశోర్

బిహార్ అసెంబ్లీ ఎన్నికల్లో తాను పోటీ చేయట్లేదని జన్ సురాజ్ పార్టీ ఫౌండర్ ప్రశాంత్ కిశోర్ వెల్లడించారు. పార్టీ బలోపేతంపై దృష్టి పెట్టానని, తన పోటీ ముఖ్యం కాదన్నారు. 150కి ఒక్క సీటు తగ్గినా ఓటమిగానే భావిస్తామని స్పష్టం చేశారు. బిహార్‌లో అధికారం చేపట్టడమే లక్ష్యంగా కొద్ది నెలల క్రితమే పీకే పార్టీ స్థాపించిన విషయం తెలిసిందే. మొత్తం 243 స్థానాలకు గాను ఇప్పటికే 116 మంది అభ్యర్థులను ప్రకటించారు.
Similar News
News October 15, 2025
అమ్మానాన్నా.. ఎందుకిలా చేస్తున్నారు!

కనిపెంచిన తల్లిదండ్రులే కన్నబిడ్డల ఊపిరి తీస్తున్నారు. కారణమేదైనా.. కాస్తయినా కనికరం లేకుండా కడతేరుస్తున్నారు. TG, APలో జరిగిన 2 సంఘటనలు కన్నీళ్లు పెట్టిస్తున్నాయి. నిన్న HYDలో భర్తతో గొడవ కారణంగా భార్య సాయిలక్ష్మి రెండేళ్ల ఇద్దరు కవలలను చంపేసింది. అనంతరం తానూ బిల్డింగ్‌పై నుంచి దూకి తనువు చాలించింది. ఇవాళ కోనసీమ(D) చిలకలపాడులో భర్త కామరాజు ఇద్దరు పిల్లలను చంపి, బలవన్మరణానికి పాల్పడ్డాడు.
News October 15, 2025
లిక్కర్ స్కాం కేసు.. చెవిరెడ్డికి స్వల్ప ఊరట

ఏపీ లిక్కర్ స్కాం కేసులో వైసీపీ నేత చెవిరెడ్డి భాస్కర్ రెడ్డికి స్వల్ప ఊరట లభించింది. మిగతా నిందితులతో సంబంధం లేకుండా ఆయన బెయిల్‌పై నిర్ణయం తీసుకోవాలని ట్రయల్ కోర్టును సుప్రీంకోర్టు ఆదేశించింది. ఈ కేసులో మిథున్ రెడ్డి బెయిల్‌పై తుది నిర్ణయం తీసుకునేంతవరకు ట్రయల్ కోర్టు మిగతా వారి బెయిల్ పిటిషన్లపై నిర్ణయం తీసుకోవద్దన్న హైకోర్టు తీర్పును చెవిరెడ్డి సుప్రీంలో సవాల్ చేశారు.
News October 15, 2025
భారీగా తగ్గిన IPL విలువ

ఇండియన్ ప్రీమియర్ లీగ్(IPL) విలువ వరుసగా రెండో ఏడాది పడిపోయింది. 2023లో రూ.93,500 కోట్లున్న వాల్యూ 2024 సీజన్ నాటికి రూ.82,700కు తగ్గింది. 2025లో మరో రూ.6,600 కోట్లు తగ్గి రూ.76,100 కోట్లకు పడిపోయింది. గతేడాదితో పోల్చితే 8% డ్రాప్ నమోదైంది. స్పాన్సర్స్‌గా ఉన్న బెట్టింగ్ యాప్స్ బ్యాన్ అవడం, TVని డిజిటల్ మీడియా ఓవర్‌టేక్ చేయడం తదితర అంశాలు ఇందుకు కారణాలు.