News February 17, 2025
రాజకీయాల్లోకి మళ్లీ రాను: కేశినేని నాని

AP: తాను బీజేపీలోకి వెళ్తున్నానంటూ జరుగుతున్న ప్రచారాన్ని మాజీ ఎంపీ కేశినేని నాని ఖండించారు. రాజకీయాల నుంచి తప్పుకుంటున్నట్లు గత ఏడాది జూన్‌లో చేసిన ప్రకటనకు కట్టుబడి ఉన్నానని స్పష్టం చేశారు. ప్రజలకు సేవ చేయడానికి పాలిటిక్స్ అవసరం లేదనే విషయాన్ని తాను నమ్ముతానని పేర్కొన్నారు. కులం, మతం, పార్టీలతో సంబంధం లేకుండా విజయవాడ ప్రజల సంక్షేమం కోసం పనిచేస్తూనే ఉంటానని తెలిపారు.
Similar News
News November 11, 2025
మా తండ్రి చనిపోలేదు: ఈషా డియోల్

తన తండ్రి ధర్మేంద్ర చనిపోలేదని కూతురు ఈషా డియోల్ ప్రకటించారు. ఆయన చనిపోయినట్లు వస్తున్న వార్తలు అవాస్తవమని తెలిపారు. ధర్మేంద్ర మృతికి సంతాపం తెలుపుతూ సినీ ప్రముఖులు పోస్టులు పెట్టడంతో ఫ్యాన్స్‌తో పాటు మీడియా వర్గాలు ఆయన చనిపోయినట్లు భావించాయి. అయితే తాజాగా ఆయన కూతురు ధర్మేంద్ర చనిపోలేదని, ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఆయన ఆరోగ్యం నిలకడగా ఉన్నట్లు తెలిపారు.
News November 11, 2025
శబరిమలకు అద్దె బస్సులు

TG: రాష్ట్రంలోని నలుమూలల నుంచి శబరిమలకు 200 అద్దె బస్సులు నడపాలని RTC నిర్ణయించింది. ఎక్స్‌ప్రెస్, డీలక్స్, సూపర్ లగ్జరీ, రాజధాని బస్సులను నడిపేందుకు సిద్ధమై స్పెషల్ టారిఫ్‌లను ఖరారు చేసింది. గురుస్వామి పేరుతో బస్ బుక్ చేస్తే ఆ స్వామి ఉచితంగా ప్రయాణించవచ్చు. ముందుగా కాషన్ డిపాజిట్ రూ.10వేలు చెల్లించాలి. తిరిగొచ్చాక ఆ డబ్బు వెనక్కిస్తారు. పూర్తి వివరాలకు డిపోలో సంప్రదించాల్సి ఉంటుంది.
News November 11, 2025
కొవిడ్ లాక్‌డౌన్.. వారికి కొత్త ద్వారాలు తెరిచింది

కరోనా లాక్‌డౌన్ వీరి జీవితాన్ని మార్చేసింది. లండన్‌లో BBA చదువుతున్న ఆయుష్, దుబాయ్‌లో బ్యాంక్ ఉద్యోగిగా పనిచేస్తున్న రిషబ్ ఇండియాకు తిరిగివచ్చారు. స్వదేశంలోనే ఉండాలని, వ్యవసాయం చేయాలని నిర్ణయించుకున్నారు. ఫ్యామిలీ ప్రోత్సాహంతో కూరగాయల సాగును ప్రారంభించి.. పుట్టగొడుగులకు ఉన్న డిమాండ్ చూసి వాటిని కూడా ఉత్పత్తి చేస్తూ ఆగ్రా సహా ఇతర రాష్ట్రాల మార్కెట్లు, హోటల్స్‌కు అందిస్తూ కోట్లు సంపాదిస్తున్నారు.


