News March 8, 2025

అలాంటి వారిని సహించను: సీఎం చంద్రబాబు

image

AP: YCPతో లాలూచీ పడిన కార్యకర్తలను సహించేది లేదని TDP అధినేత, CM చంద్రబాబు హెచ్చరించారు. లాలూచీ పడితే నిజమైన కార్యకర్త మనోభావాలు దెబ్బతింటాయన్నారు. ‘కూటమిలోని 3 పార్టీలు కలిసి పనిచేయాలి. MLA/MP పదవుల్లో వన్ టైమ్ కాకుండా శాశ్వతంగా ఉండేలా పనిచేయాలి. నేతలు, కార్యకర్తల పనితీరుపై సమీక్షిస్తాం. చెప్పిన తర్వాత కూడా మారకపోతే వారిని ఎలా నియంత్రించాలో పార్టీకి తెలుసు’ అని కార్యకర్తల భేటీలో వ్యాఖ్యానించారు.

Similar News

News November 25, 2025

వరంగల్: అడ్డాలు తెచ్చిన తంటా..!

image

అదృష్టం వరించిందని సంతోషపడాలో, అడ్డా దొరకలేదని బాధపడాలో అర్థం కాని పరిస్థితిలో మద్యం షాపుల ఓనర్లు ఉన్నారు. వరంగల్‌లో లిక్కర్ మార్ట్‌లను దక్కించుకున్న కొత్త వాళ్లకు, పాత షాపుల ఓనర్లు చుక్కలు చూపిస్తున్నారట. HNKలో లిక్కర్ వ్యాపారి తనకు వాటా ఇస్తేనే ఇంటి ఓనర్ నుంచి షాపు రెంట్‌కు ఇప్పిస్తా అనడంతో చేసేదేంలేక తనకు వచ్చిన 2 కొత్త షాపుల్లో వాటా ఇచ్చారట. అన్ని చోట్ల కొత్తవాళ్లకు ఇలా సవాలు ఎదురవుతోంది.

News November 25, 2025

ఎర్రనల్లితో పంటకు తీవ్ర నష్టం, నివారణ ఎలా?

image

ఎర్రనల్లి పురుగు వల్ల పంటలకు చాలా నష్టం జరుగుతుంది. ఎరుపు రంగు శరీరంతో ఈ పురుగులు ఆకుల అడుగు భాగాన గుంపులుగా పెరుగుతూ ఆకుల నుంచి రసాన్ని పీలుస్తాయి. దీని వల్ల ఆకులోని పత్రహరితం తగ్గిపోయి ఆకులపై తెలుపు, పసుపు మచ్చలు ఏర్పడతాయి. ఆకులు పాలిపోయి మొక్కలపై బూడిద చల్లినట్లు కళావిహీనంగా కనిపిస్తాయి. ఎర్రనల్లి నివారణకు లీటరు నీటికి డైకోఫాల్ 5ml లేదా అబామెక్టిన్ 0.5ml కలిపి పిచికారీ చేయాలి.

News November 25, 2025

అరుణాచల్ మా భూభాగం: చైనా

image

షాంఘై ఎయిర్‌పోర్టులో భారత మహిళను <<18373970>>వేధించారన్న<<>> ఆరోపణలను చైనా ఖండించింది. ‘ఎలాంటి నిర్బంధం, వేధింపులకు ఆమె గురి కాలేదు. చట్టాలు, రూల్స్‌కు అనుగుణంగానే అధికారులు వ్యవహరించారు. రెస్ట్ తీసుకునేందుకు చోటిచ్చి, ఆహారం, నీళ్లు అందజేశారు. జాంగ్‌నాన్(అరుణాచల్) చైనా భూభాగం. ఇండియా చట్టవిరుద్ధంగా ఏర్పాటు చేసిన అరుణాచల్ ప్రదేశ్‌ను మేం ఎప్పుడూ గుర్తించలేదు’ అని చైనా విదేశాంగ శాఖ ప్రతినిధి మావో నింగ్ చెప్పారు.