News April 13, 2025
అలాంటి యాడ్స్ మాత్రమే చేస్తా: సమంత

ఒకప్పుడు తనకు నచ్చిన బ్రాండ్స్‌ని ప్రమోట్ చేశానని, అందుకు తన ఫాలోవర్స్‌కి క్షమాపణలు చెబుతున్నానని హీరోయిన్ సమంత తెలిపారు. ఈ ఏడాది 15 బ్రాండ్స్ వదులుకున్నట్లు ఆమె చెప్పారు. ‘ప్రస్తుతం బ్రాండ్స్ ప్రమోట్ విషయంలో బాధ్యతగా ఉంటున్నా. నా వద్దకు ఎన్నో యాడ్స్ వస్తుంటాయి. కానీ ఆ ఉత్పత్తులను నాకు తెలిసిన డాక్టర్లతో పరీక్షలు చేయిస్తా. అవి ప్రజలకు హానీ చేయవని నిర్ధారణ అయ్యాకే ప్రమోట్ చేస్తున్నా’ అని తెలిపారు.
Similar News
News April 15, 2025
Intermediate: సంస్కృతంతో తెలుగుకు దెబ్బేనా?

TG: ప్రభుత్వ జూనియర్ కాలేజీల్లో సంస్కృతాన్ని రెండోభాషగా ప్రవేశపెట్టాలన్న ఇంటర్మీడియట్ అధికారుల నిర్ణయం వివాదాస్పదం అవుతోంది. ఇప్పటికే కార్పొరేట్ కాలేజీల్లో 90% మంది విద్యార్థులు ఎక్కువ మార్కులు వస్తాయని సంస్కృతాన్ని ఎంచుకుంటున్నారు. టెన్త్ వరకు తెలుగు చదివిన విద్యార్థులు ఇంటర్‌లో సంస్కృతాన్ని తీసుకుంటే తెలుగు భాషకు తీవ్ర నష్టం జరుగుతుందని విశ్లేషకులు ఆవేదన చెందుతున్నారు. దీనిపై మీ కామెంట్?
News April 15, 2025
ఇంజినీరింగ్ విద్యార్థులకు బిగ్ షాక్?

TG: ఇంజినీరింగ్ విద్యార్థులకు బిగ్ షాక్ తగలనున్నట్లు తెలుస్తోంది. రాష్ట్రంలోని ప్రైవేట్ ఇంజినీరింగ్ కాలేజీలు ఫీజులు పెంచాలని ప్రభుత్వాన్ని కోరుతున్నట్లు తెలుస్తోంది. దీంతో ఫీజులపై అధ్యయనం చేసేందుకు ఓ కమిటీని ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ కమిటీ నివేదిక వచ్చిన తర్వాత ఫీజులపై ఓ నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. కాగా 52% నుంచి 84% ఫీజులు పెంచాలని ప్రభుత్వంపై కాలేజీలు ఒత్తిడి తెస్తున్నాయి.
News April 15, 2025
కారు డోర్ లాకింగ్ మర్చిపోకండి!

TG: మీరు ఏ పనిలో ఉన్నా పిల్లల్ని ఓ కంట గమనిస్తూనే ఉండాలనడానికి ఇది ప్రత్యక్ష ఉదాహరణ. రంగారెడ్డి జిల్లా చేవెళ్లలో నిన్న తన్మయశ్రీ(5), అభినయశ్రీ(4) కారులో ఊపిరాడక చనిపోయినట్లు పోలీసులు తెలిపారు. మేనమామకు పెళ్లి కుదిరిందని వెళ్లిన పిల్లలు కారులో ఆడుకోవడానికి వెళ్లి డోర్ లాక్ చేసుకున్నారు. కాబట్టి ఎప్పుడూ కారును లాక్ చేసి ఉంచండి. ముఖ్యంగా చిన్న పిల్లలున్న పేరెంట్స్ ఇది మర్చిపోవద్దు.