News March 22, 2025

వ్యోమగాములకు నా సొంత డబ్బు చెల్లిస్తా: ట్రంప్

image

8రోజుల మిషన్ కోసం అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి వెళ్లిన నాసా వ్యోమగాములు సునీతా విలియమ్స్, విల్‌మోర్ 9 నెలలకు పైగా అక్కడే ఉండిపోయిన సంగతి తెలిసిందే. ఆ అదనపు కాలానికి వారిద్దరికీ రోజుకు చెరో 5 డాలర్ల చొప్పున 286 రోజులకు 1430 డాలర్ల వేతనాన్ని నాసా ఇవ్వకపోవడంపై ట్రంప్ విస్మయం వ్యక్తం చేశారు. ఆ విషయం తనకు తెలియదని తెలిపారు. అవసరమైతే తన సొంత డబ్బునే వారికి జీతాలుగా ఇస్తానని స్పష్టం చేశారు.

Similar News

News November 17, 2025

iBOMMAకు ఎందుకంత క్రేజ్?

image

ఇతర పైరసీ వెబ్‌సైట్లలో యాడ్స్ ఎక్కువగా ఉండటం వల్ల వీక్షకులు డిస్టర్బ్ అవుతారు. కానీ ఐబొమ్మలో సినిమా చూసేందుకు క్లిక్ చేసినప్పుడు మాత్రమే యాడ్ వస్తుంది. దాన్ని క్లోజ్ చేసి మరోసారి ఓపెన్ చేస్తే ఇక యాడ్స్ కనిపించవు. అలాగే HD ప్రింట్ వస్తుంది కాబట్టి లక్షల మంది ఆ సైట్‌లో సినిమాలు చూసేందుకు ఇష్టపడతారు. ఐబొమ్మ, బప్పం వెబ్‌సైట్లను ప్రతి నెలా 30 లక్షల మంది చూస్తున్నట్లు పోలీసులు గుర్తించారు.

News November 17, 2025

బీఎస్సీ నర్సింగ్‌లో అడ్మిషన్లు

image

AP: రాష్ట్రంలోని నర్సింగ్ కాలేజీల్లో 2025-26 విద్యాసంవత్సరానికి సంబంధించి 4 ఏళ్ల బీఎస్సీ నర్సింగ్ కోర్సులో అడ్మిషన్లకు దరఖాస్తులు స్వీకరిస్తున్నట్లు విజయవాడలోని NTR హెల్త్ యూనివర్సిటీ తెలిపింది. APNCET-2025లో 20 పర్సంటైల్ కంటే ఎక్కువ, 85-17 కటాఫ్ స్కోర్ మధ్య ఉన్నవారు అప్లై చేసుకోవచ్చని పేర్కొంది. చివరి తేదీ నవంబర్ 18. పూర్తి వివరాలకు <>క్లిక్<<>> చేయండి.

News November 17, 2025

సినిమా అప్డేట్స్

image

* సన్నీ డియోల్ ‘జాట్-2’ చిత్రానికి రాజ్‌కుమార్ సంతోషి డైరెక్షన్ చేయనున్నట్లు సమాచారం. తొలి పార్ట్‌ను తెరకెక్కించిన గోపీచంద్ మలినేని మరో ప్రాజెక్టులో బిజీగా ఉండటమే కారణం.
* సంజయ్ లీలా భన్సాలీ డైరెక్షన్‌లో ‘హీరామండి’ సీక్వెల్ షూటింగ్ త్వరలో ప్రారంభం కానుంది.
* యూనిసెఫ్ ఇండియా సెలబ్రిటీ అడ్వకేట్‌గా ఎంపికవడం గర్వంగా ఉంది. పిల్లలు సంతోషం, ఆరోగ్యంతో కూడిన జీవితాన్ని గడపడానికి కృషి చేస్తా: కీర్తి సురేశ్