News July 1, 2024
ఆ చిరునవ్వు నా జీవితాంతం గుర్తుంటుంది: లోకేశ్

AP: ఈ రోజు పెన్షన్లు అందుకున్న అవ్వాతాతల చిరునవ్వు తన జీవితాంతం గుర్తుంటుందని మంత్రి లోకేశ్ అన్నారు. ప్రజా నాయకుడికి, పరదాల నాయకుడికి మధ్య తేడా ఈరోజు ప్రజలకు అర్థమైందన్నారు. ఇచ్చిన హామీ ప్రకారం సీఎం చంద్రబాబు పెద్ద కొడుకుగా పెన్షన్ రూ.4వేలు చేశారని గుర్తు చేశారు. అరియర్స్తో కలిపి రూ.7 వేల పెన్షన్ ఇంటి వద్దనే అందజేశారని ట్వీట్ చేశారు.
Similar News
News November 27, 2025
రామ్ ‘ఆంధ్ర కింగ్ తాలూకా’ పబ్లిక్ టాక్

రామ్ పోతినేని ‘ఆంధ్ర కింగ్ తాలూకా’ మూవీ ప్రీమియర్లు USAలో మొదలయ్యాయి. RA-PO వన్ మ్యాన్ షో చేశాడని, చాలారోజుల తర్వాత ఆయన ఖాతాలో హిట్ పడిందని సినిమా చూసిన నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. రామ్-భాగ్యశ్రీ కెమిస్ట్రీ కుదిరిందంటున్నారు. స్క్రీన్ప్లే బాగుందని, ఎమోషనల్గా కనెక్ట్ అవుతాయని చెబుతున్నారు. కొన్నిసీన్లు అసందర్భంగా వస్తాయని మరికొందరు కామెంట్స్ చేస్తున్నారు. మరికొన్ని గంటల్లో Way2News రివ్యూ.
News November 27, 2025
MTU 1232.. ముంపు ప్రాంత రైతులకు వరం

MTU 1075, స్వర్ణ రకాలతో సంకరణం చేసి MTU 1232ను అభివృద్ధి చేశారు. ఇది మధ్యస్థ సన్నగింజ రకం. నాట్లు వేశాక 14-15 రోజుల వరకు ముంపును తట్టుకోగలదు. పంటకాలం సాధారణంగా 135-140 రోజులు, ముంపునకు గురైతే 140-145 రోజులు. మొక్క ఎత్తు 120 సెం.మీ. అగ్గి తెగులు, దోమపోటు, మాగుడు తెగులును తట్టుకుంటుంది. ఇది సాధారణ భూమిలో ఎకరాకు 40 బస్తాలు, ముంపు ప్రాంతాల్లో ఎకరాకు 30 నుంచి 35 బస్తాల దిగుబడినిస్తుంది.
News November 27, 2025
డెలివరీ తర్వాత ఈ లక్షణాలున్నాయా?

డెలివరీ తర్వాత మహిళల్లో అనేక మార్పులు వస్తాయి. జుట్టు ఎక్కువగా రాలడం, శారీరక మార్పులు, వాపు, మలబద్ధకం, కాళ్లు, పాదాల్లో వాపు వంటి సమస్యలు వస్తాయి. వీటిని తగ్గించాలంటే పోషకాలతో కూడిన సమతులాహారం తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. సాధారణంగా ఇవి కొన్ని రోజుల్లో తగ్గిపోతాయి. కానీ ఎన్ని రోజులైనా వీటి నుంచి ఉపశమనం లభించకపోతే, అశ్రద్ధ చేయకుండా సంబంధిత వైద్య నిపుణులను సంప్రదించడం మంచిదని చెబుతున్నారు.


