News March 26, 2025
నేనలా అన్నట్లు నిరూపిస్తే రాజీనామా చేస్తా: డీకే

ముస్లింలకు 4% రిజర్వేషన్ కల్పించేందుకు రాజ్యాంగాన్ని మారుస్తామని తాను అనలేదని కర్ణాటక డిప్యూటీ సీఎం DK శివకుమార్ తెలిపారు. తాను అలా అన్నట్లు నిరూపిస్తే రాజకీయాలను వదిలేస్తానని స్పష్టం చేశారు. బీజేపీ నేతలు తన వ్యాఖ్యలను వక్రీకరిస్తున్నారని మండిపడ్డారు. ‘ముస్లింలకు కోటా కల్పించడానికి రాజ్యాంగాన్ని మార్చగల “మంచి రోజు” రావచ్చు’ అని ఇటీవల ఓ కార్యక్రమంలో డీకే వ్యాఖ్యానించారు. దీంతో ఈ వివాదం మొదలైంది.
Similar News
News November 19, 2025
చరిత్ర లిఖించిన అతిచిన్న దేశం.. FIFA వరల్డ్ కప్‌కు అర్హత!

కరీబియన్ దీవి దేశమైన కురాకో FIFA ప్రపంచ కప్‌కు అర్హత సాధించి చరిత్ర సృష్టించింది. కేవలం 1.56 లక్షల జనాభా కలిగిన ఈ దేశం ప్రపంచ కప్‌కు అర్హత సాధించిన అత్యంత చిన్న దేశంగా రికార్డు నెలకొల్పింది. గతంలో ఐస్లాండ్ పేరిట ఉన్న రికార్డును ఇది బద్దలు కొట్టింది. జమైకాతో జరిగిన కీలక క్వాలిఫయింగ్ మ్యాచ్‌లో 0-0తో డ్రా చేసుకొని 2026 WCలో స్థానం సాధించింది. అర్హత సాధించడంతో ప్లేయర్లు ఎమోషనలయ్యారు.
News November 19, 2025
ఇతిహాసాలు క్విజ్ – 71 సమాధానాలు

ప్రశ్న: గణేశుడు భారతాన్ని రాసేటప్పుడు తన దంతాన్ని ఎందుకు విరిచాడు?
జవాబు: వినాయకుడు భారతం రాసేటప్పుడు ఈకలు ప్రతిసారి విరిగిపోయాయి. రచనను మధ్యలో ఆగిపోకూడదనే షరతుకు కట్టుబడిన గణేషుడు ఈకలతో పని కాదని గ్రహించి తన దంతాన్ని విరిచి మహాభారతాన్ని రాయడం పూర్తిచేశాడు. మరో కథనం ప్రకారం.. పరశురాముణ్ని నిరోధించడంతో రెండు దంతాల్లో ఒక దాన్ని విరిచేస్తాడని చెబుతారు. <<-se>>#Ithihasaluquiz<<>>
News November 19, 2025
ధనుష్ పేరిట కమిట్మెంటు అడిగారు: మాన్య

హీరో ధనుష్ పేరిట కమిట్మెంటు అడిగారని తమిళ నటి మాన్య ఆనంద్ ఆరోపించారు. ధనుష్ నిర్మించే సినిమాలో నటించేందుకు శ్రేయస్ అనే వ్యక్తి కాల్ చేశాడన్నారు. ధనుష్ కోసమంటూ కాస్టింగ్ కౌచ్ గురించి చెప్పాడన్నారు. స్క్రిప్ట్, ప్రొడక్షన్ హౌస్ లొకేషన్ పంపగా నంబర్‌ను బ్లాక్ చేశానని చెప్పారు. దీనిపై ధనుష్ టీమ్ స్పందిస్తూ మేనేజర్ పేరిట ఎవరో అమ్మాయిల్నిబ్లాక్‌మెయిల్ చేస్తున్నారని, పోలీసులకు ఫిర్యాదు చేశామని తెలిపింది.


