News March 15, 2025
నా చివరి రక్తపు బొట్టువరకూ ప్రజలకు సేవ చేస్తాను: సీఎం చంద్రబాబు

AP: తన జీవితం ప్రజల కోసం అంకితమని తణుకు పర్యటనలో CM చంద్రబాబు తెలిపారు. ‘41 ఏళ్లుగా అసెంబ్లీకి వెళ్తున్నాను. పదేళ్లు ప్రతిపక్ష నేతగా పనిచేశాను. నా జీవితమంతా అలుపెరుగని పోరాటమే. నా చివరి రక్తపు బొట్టు వరకు మీకు సేవ చేయాలనేదే నా సంకల్పం. ఇప్పటి వరకు చేసినదానికి రెట్టింపు పనిని వచ్చే 5, 10 ఏళ్లలో చేస్తాను. వచ్చే 22 ఏళ్లలో మన రాష్ట్రాన్ని దేశంలో నంబర్ వన్‌గా చేస్తాను’ అని వ్యాఖ్యానించారు.
Similar News
News February 22, 2026
తిరుమల వ్యవహారం.. SCలో సుబ్రహ్మణ్య స్వామి పిటిషన్

AP: తిరుమల లడ్డూ వ్యవహారంలో కీలక పరిణామం చోటు చేసుకుంది. సుప్రీంకోర్టు ఏర్పాటు చేసిన సిట్ నివేదికపై రాష్ట్ర ప్రభుత్వం ఏకసభ్య కమిటీ వేయడాన్ని సవాల్ చేస్తూ BJP సీనియర్ నేత సుబ్రహ్మణ్య స్వామి SCలో పిటిషన్ వేశారు. ప్రతివాదులుగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు, CM చంద్రబాబు, సిట్, సీబీఐ, టీటీడీలను చేర్చారు. సీజేఐ సూర్యకాంత్, జస్టిస్ జాయ్ మాల్యా బాగ్చి ధర్మాసనం రేపు ఈ పిటిషన్‌ను విచారించనుంది.
News February 22, 2026
బానిసత్వ మనస్తత్వం వీడాలి.. దేశ సంస్కృతిని గౌరవించుకోవాలి: మోదీ

బానిసత్వ మనస్తత్వం వీడి భారతీయ సంస్కృతిని గౌరవించుకోవాలని PM మోదీ పిలుపునిచ్చారు. రేపటి నుంచి MAR 1 వరకు రాష్ట్రపతి భవన్లో ‘రాజాజీ ఉత్సవం’ నిర్వహించనున్నట్లు ‘మన్ కీ బాత్’ ఎపిసోడ్లో తెలిపారు. AI సమ్మిట్ గురించి ప్రస్తావించారు. AIలో దేశ పురోగతి, యానిమల్ హెల్త్ కేర్&అగ్రికల్చర్లో టెక్నాలజీ వినియోగంపై వివరించారు. ఈ నెల 24న TN మాజీ సీఎం జయలలిత జయంతి నేపథ్యంలో ఆమె సేవలను గుర్తుచేశారు.
News February 22, 2026
పాకిస్థాన్ అందుకే ఓడిపోతోంది: షోయబ్ అక్తర్

భారత్‌తో పాకిస్థాన్ మ్యాచ్ ఓడిపోతుండటానికి టీమ్ సెలక్షనే కారణం అని ఆ దేశ మాజీ పేసర్ షోయబ్ అక్తర్ అన్నారు. జట్టు ఎంపిక సరిగ్గా లేదని.. అసలు ఏం చేస్తున్నామో అర్థం కావట్లేదని ఆవేదన వ్యక్తం చేశారు. టీమ్ సెలక్షన్ సరిగ్గా ఉంటే ఏ జట్టునైనా ఓడించగల సమర్థత పాక్‌కు ఉందన్నారు. ICC టోర్నీల్లో పాక్ భారత్ చేతిలో చిత్తుగా ఓడిపోతున్న సంగతి తెలిసిందే. కాగా పాక్ <<19206100>>సెమీస్<<>> చేరాలంటే ENG, SLపై కచ్చితంగా గెలవాలి.


