News January 17, 2025

దేశం గర్వించేలా మరింత కష్టపడతా: మనూ భాకర్

image

ధ్యాన్‌చంద్ ఖేల్‌రత్న అవార్డు అందుకోవడంపై ఒలింపిక్ మెడలిస్ట్, భారత షూటర్ మనూ భాకర్ స్పందించారు. ‘గౌరవ రాష్ట్రపతి నుంచి ఖేల్ రత్న అవార్డు అందుకోవడం ఎంతో గర్వంగా భావిస్తున్నా. ఈ గుర్తింపు నా దేశం గర్వపడేలా చేసేందుకు మరింత కష్టపడి పనిచేయడానికి, విజయాలు పొందేందుకు స్ఫూర్తినిస్తోంది. నాకు మద్దతునిచ్చిన, ప్రోత్సహించిన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు’ అని ట్వీట్ చేశారు.

Similar News

News November 26, 2025

ఘనపూర్‌లో అత్యధికం.. శ్రీరంగాపూర్‌లో అత్యల్పం

image

వనపర్తి జిల్లాలో అత్యధికంగా ఘనపూర్ మండలంలో 29 పంచాయతీలు ఉండగా, అత్యల్పంగా శ్రీరంగాపూర్ మండలంలో 8 పంచాయతీలు ఉన్నాయి. ఘనపూర్‌కు తొలి విడతలో, శ్రీరంగాపూర్‌కు మూడో విడతలో ఎన్నికలు జరగనున్నాయి. ఘనపూర్ తర్వాత పానగల్ మండలంలో 28 పంచాయతీలకు మూడో విడతలో పోలింగ్ జరగనుంది. షెడ్యూల్ విడుదల కావడంతో గ్రామాల్లో రాజకీయ వేడి రాజుకుంది.

రెండో టెస్ట్ డ్రాగా ముగిస్తే గెలిచినట్లే: జడేజా

image

SAతో రెండో టెస్టులో ఐదో రోజు తమ బెస్ట్ ఇస్తామని IND ఆల్‌రౌండర్ జడేజా అన్నారు. ‘ఈ మ్యాచును డ్రాగా ముగిస్తే విజయం సాధించినట్లే. సిరీస్ ఓడాలని ఎవరూ కోరుకోరు. వచ్చే సిరీస్‌పై దీని ప్రభావం ఉండదు. టీమ్‌లో ఎక్కువగా యంగ్ ప్లేయర్లున్నారు. ఇప్పుడిప్పుడే నేర్చుకుంటున్నారు. ఫ్యూచర్‌లో బాగా రాణిస్తారు’ అని ప్రెస్ కాన్ఫరెన్స్‌లో వ్యాఖ్యానించారు. IND గెలవాలంటే ఇంకా 522 రన్స్ చేయాలి. చేతిలో 8 వికెట్లున్నాయి.