News March 30, 2024

‘RCB కప్ కొట్టే వరకూ స్కూల్‌కి వెళ్లను’

image

రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుకు ఉన్న ఫాలోయింగ్ గురించి కొత్తగా చెప్పనక్కర్లేదు. ముఖ్యంగా మహిళలు, పిల్లలు ఈ టీమ్‌ను ఆరాధిస్తారు. తాజాగా RCBvsKKR మ్యాచ్‌లో ఈ జట్టుకు చెందిన ఓ చిన్నారి ఫ్యాన్ ఇంట్రెస్టింగ్ ప్లకార్డుతో కనిపించింది. ‘RCB కప్ కొట్టే వరకూ స్కూల్‌కి వెళ్లను’ అనే ప్లకార్డుపై రాసి ఉంది. దీనిపై కొందరు సెటైర్లు వేస్తున్నారు. స్కూలుకు వెళ్లొద్దని గట్టి ప్లాన్ వేసిందంటూ కామెంట్స్ చేస్తున్నారు.

Similar News

News October 5, 2024

MGR వీరాభిమానులకు పవన్ కళ్యాణ్ శుభాకాంక్షలు

image

తమిళనాట రాజకీయాల్లో కీలక పార్టీ ‘ఏఐఏడీఎంకే’ ఏర్పాటై ఈ నెల 17కు 53ఏళ్లు పూర్తవుతున్నాయి. ఈ సందర్భంగా ఆ పార్టీ వ్యవస్థాపకుడు MGR ఫ్యాన్స్‌కు AP డిప్యూటీ CM పవన్ కళ్యాణ్ శుభాకాంక్షలు తెలిపారు. ‘పురచ్చి తలైవర్’ MGRపై అభిమానం తాను చెన్నైలో ఉన్నప్పుడు మొదలైందని తెలిపారు. పవన్‌ను వ్యతిరేకిస్తున్న డీఎంకే సర్కారుకు చెక్ పెట్టేలా ఏఐఏడీఎంకేకి దగ్గరయ్యేలా పవన్ ట్వీట్ ఉందని రాజకీయ వర్గాలు విశ్లేషిస్తున్నాయి.

News October 5, 2024

ఇలా చేస్తే వాహనదారులకు రాయితీ!

image

TG: కాలం చెల్లిన వాహనాల్ని తుక్కుగా మార్చే వాహనదారులకు రాష్ట్ర ప్రభుత్వం పన్ను మినహాయింపు ఇవ్వనుంది. ‘వెహికల్ స్క్రాప్ పాలసీ’ కింద బైక్స్‌కు లైఫ్ ట్యాక్స్‌లో ₹1,000-₹7,OOO, 4 వీలర్స్‌కు ₹15,000-₹50,000 రాయితీని కల్పించనుంది. కొత్తగా కొనే వాహనాల విలువను బట్టి డిస్కౌంట్ ఉంటుందని సమాచారం. ఇది వ్యక్తిగత వాహనాలకు, రవాణా వాహనాలకు వేర్వేరు విధాలుగా వర్తించనుంది. 2 రోజుల్లో దీనిపై ఉత్తర్వులు రానున్నాయి.

News October 5, 2024

సెబీ చీఫ్ మాధబీ, ట్రాయ్ చీఫ్‌ లాహోటిలకు సమన్లు

image

సెబీ, ట్రాయ్‌ల ప‌నితీరుపై పార్ల‌మెంటు PAC ఈ నెల 24న స‌మీక్షించ‌నుంది. ఈ మేర‌కు సెబీ చీఫ్ మాధబీ పురీ, ట్రాయ్ ఛైర్మ‌న్ అనిల్ కుమార్ లాహోటిల‌కు స‌మ‌న్లు జారీ చేసింది. అయితే, ఈ స‌మీక్ష‌కు రెండు సంస్థ‌ల నుంచి మాద‌బీ, లాహోటిల‌ తరఫున సీనియ‌ర్ అధికారులు హాజర‌య్యే అవ‌కాశం ఉన్న‌ట్టు క‌మిటీ పేర్కొంది. ఆర్థిక అవకతవకలపై ఇటీవల మాధబి తీవ్ర ఆరోప‌ణ‌లు ఎదుర్కొంటున్న వేళ ఈ స‌మీక్షకు ప్రాధాన్యం సంత‌రించుకుంది.