News March 4, 2025
ఇండియాలో మాత్రం బికినీ వేసుకోను: సోనాక్షి సిన్హా

ఇండియాలో తాను ఎట్టి పరిస్థితుల్లో బికినీ వేసుకోనని హీరోయిన్ సోనాక్షి సిన్హా అన్నారు. ఇక్కడ ఎవరు ఏ వైపు నుంచి ఫొటో తీస్తారో తెలియదని చెప్పారు. అందుకే వేరే దేశం వెళ్లినప్పుడు బికినీ వేసుకుని స్విమ్మింగ్ చేస్తానని పేర్కొన్నారు. దీనిపై కొందరు ఆమెకు సపోర్ట్‌గా నిలవగా ఆ ఫొటోలు నెట్టింట ఎందుకు షేర్ చేస్తున్నావు? అంటూ మరికొందరు కామెంట్లు పెడుతున్నారు.
Similar News
News March 4, 2025
వారికి ప్రభుత్వ పథకాలు కట్?

AP: గంజాయి, డ్రగ్స్ రవాణా, వినియోగాన్ని అరికట్టేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. ఈ క్రమంలో మరో కీలక నిర్ణయం తీసుకోనున్నట్లు సమాచారం. మాదకద్రవ్యాల కేసుల్లో పట్టుబడిన వారి కుటుంబాలకు సంక్షేమ పథకాలను నిలిపేయనున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే ప్రతిపాదనలు సిద్ధమైనట్లు అధికారవర్గాలు వెల్లడించాయి. త్వరలోనే క్యాబినెట్‌లో చర్చించి ఆమోదించనున్నట్లు తెలిపాయి.
News March 4, 2025
రూ.100 కోట్ల ఆస్తి.. తల్లిని చంపేసిన కొడుకు

TG: ఆస్తి కోసం తల్లినే చంపేసిన దారుణ ఘటన సంగారెడ్డి(D) తెల్లాపూర్‌లో జరిగింది. మల్లారెడ్డి, రాధికారెడ్డి దంపతుల చిన్న కుమారుడు కార్తీక్ మద్యానికి బానిసయ్యాడు. కోయంబత్తూరులోని డీఅడిక్షన్‌లో చేర్చినా అతనిలో మార్పు రాలేదు. తిరిగొచ్చాక రూ.100 కోట్ల విలువైన భూమిని తనకు ఇవ్వాలంటూ పేరెంట్స్‌ను వేధించేవాడు. నిన్న నిద్రిస్తున్న తల్లిని కత్తితో 9చోట్ల పొడిచి చంపేశాడు. నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేశారు.
News March 4, 2025
ఇంటి అద్దెలను ప్రభుత్వాలు నియంత్రించలేవా?

హైదరాబాద్, వరంగల్, విజయవాడ, విశాఖ సహా చాలా నగరాలు, పట్టణాల్లో ఇంటి అద్దెలు విపరీతంగా ఉంటున్నాయి. అగ్గిపెట్టెల్లాంటి ఇళ్ల అద్దెలూ నోరెళ్లబెట్టేలానే ఉన్నాయి. నెలజీతంలో సగం ఇంటి అద్దెకే పోతోందని చిరు ఉద్యోగులు వాపోతున్నారు. నీళ్లు, ఇతర సౌకర్యాలు లేకపోయినా అద్దెలు ఆకాశాన్నే తాకుతున్నాయి. ఒక ప్రాతిపదిక అనేది లేకుండా ఓనర్లు ఇష్టారీతిన పెంచే ఈ అద్దెలను ప్రభుత్వాలు నియంత్రించాలని ప్రజలు కోరుతున్నారు.