News January 12, 2025
WC ఆడుతూ యువీ చనిపోయినా గర్వపడేవాడిని: తండ్రి యోగ్రాజ్

క్యాన్సర్తో బాధపడుతూ, రక్తపు వాంతులు చేసుకుంటూ 2011 WCలో యువరాజ్ ఆడిన ఇన్నింగ్స్లు ఎప్పటికీ చిరస్మరణీయం. ఆ ఘటనపై తాజాగా ఆయన తండ్రి యోగ్రాజ్ స్పందించారు. దేశం కోసం WC ఆడుతూ తన కొడుకు చనిపోయినా గర్వపడేవాడినని తెలిపారు. ఇదే విషయం అప్పట్లో యువీకి ఫోన్లో చెప్పానని గుర్తుచేసుకున్నారు. ‘నువ్వు బాధపడకు. నీకు ఏం కాదు. దేశం కోసం వరల్డ్ కప్ గెలువు’ అని ధైర్యం నూరిపోశానని పేర్కొన్నారు.
Similar News
News December 12, 2025
‘పత్తిలో 18% తేమ ఉన్నా కొనుగోలు చేయాలి’

సీసీఐ తేమ నిబంధనలతో పత్తి రైతులు తీవ్రంగా నష్టపోతున్నారని, వాటిని సడలించాలని.. TDP MP లావు శ్రీకృష్ణదేవరాయలు కేంద్రాన్ని కోరారు. లోక్సభ జీరో అవర్లో ఈ అంశాన్ని ప్రస్తావించారు. ‘పత్తిలో తేమ 8-12% మించకూడదని CCI నిబంధనలున్నాయి. దీన్ని సడలించి 18% తేమ ఉన్నా కొనుగోలు చేయాలి. అలాగే వర్షంలో తడిచినా, రంగుమారిన పత్తిని ప్రత్యేక కేటగిరీ కింద తగిన ధరకు కొనుగోలు చేయాలి’ అని కేంద్రాన్ని డిమాండ్ చేశారు.
News December 12, 2025
మునగాకుతో ఎన్నో లాభాలు

ఆయుర్వేదంలో మునగకు ఓ ప్రత్యేక స్థానం ఉంది. దీన్ని ఆహారంలో భాగం చేసుకోవడం వల్ల ఎన్నో లాభాలున్నాయి. NCBI నివేదిక ప్రకారం.. మునగ ఆకుల్లో ప్రొటీన్లు, కార్బోహైడ్రేట్లు, కాల్షియం, పొటాషియం, మెగ్నీషియం, ఐరన్, విటమిన్-ఎ, సి, బి కాంప్లెక్స్, బీటా-కెరోటిన్, అమైనో యాసిడ్స్, ఫినోలిక్లతో పాటు, 40 కంటే ఎక్కువ రకాల యాంటీఆక్సిడెంట్లు ఉన్నాయి. ఇందులో ఉండే పీచు, జీర్ణవ్యవస్థతో పాటు పొట్టను ఆరోగ్యంగా ఉంచుతుంది.
News December 12, 2025
తండ్రయిన టాలీవుడ్ యంగ్ హీరో

టాలీవుడ్ యంగ్ హీరో తిరువీర్ తండ్రయ్యారు. ఆయన భార్య కల్పనారావు మగబిడ్డకు జన్మనిచ్చారు. ఈ సందర్భంగా తిరువీర్ తన ఆనందాన్ని X వేదికగా పంచుకున్నారు. ‘నాయినొచ్చిండు ❤️’ అంటూ బిడ్డ చేతిని పట్టుకున్న ఫొటోను షేర్ చేయగా అభిమానులు ఆయనకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. ‘మసూద’, ‘పలాస 1978’, ‘ది గ్రేట్ ప్రీ వెడ్డింగ్ షో’ వంటి చిత్రాలతో గుర్తింపు పొందిన తిరువీర్.. కల్పనారావును 2024లో వివాహం చేసుకున్నారు.


