News December 31, 2024
నాగబాబు స్థానంలో ఎవరున్నా పదవి ఇచ్చేవాడిని: పవన్ కళ్యాణ్
AP: తన సోదరుడు నాగబాబుకు మంత్రిపదవి ఇవ్వడంపై డిప్యూటీ CM పవన్ కళ్యాణ్ మీడియాతో చిట్‌చాట్‌లో వివరణ ఇచ్చారు. ‘క్యాబినెట్లో అవకాశం నా సోదరుడని ఇవ్వలేదు. నాతో సమానంగా ఆయన పనిచేశారు. ఒకవేళ ఆ స్థానంలో నా సోదరుడి కాని వ్యక్తి, వేరే సామాజిక వర్గానికి వారైనా అదే అవకాశం ఇచ్చేవాడిని. కందుల దుర్గేశ్ కులమేంటో నాకు ఇప్పటికీ తెలీదు. కలిసి అభివృద్ధి కోసం పనిచేసేవారిని వారసత్వంగా చూడలేం’ అని స్పష్టం చేశారు.
Similar News
News January 3, 2025
తెలుగు రాష్ట్రాలకు బీజేపీ ఎన్నికల ఇన్చార్జులు వీరే
తెలుగు రాష్ట్రాల బీజేపీ ఎన్నికల ఇన్చార్జుల్ని నియమించింది. తెలంగాణకు వ్యవసాయ శాఖ సహాయ మంత్రి శోభా కరంద్లాజే, ఆంధ్రప్రదేశ్‌కు కర్ణాటక బీజేపీ నేత పీసీ మోహన్ పేర్లను ప్రకటించింది. ఇక తెలంగాణ బీజేపీ చీఫ్ కిషన్ రెడ్డిని తమిళనాడుకు రిటర్నింగ్ అధికారిగా నియమించింది. బీజేపీ నిబంధనల ప్రకారం పార్టీ జిల్లా అధ్యక్షుడు రాష్ట్ర అధ్యక్షుడిని ఎన్నుకుంటారు.
News January 3, 2025
BGT: నేటి టెస్టు టైమింగ్స్ ఇవే
నేడు సిడ్నీలో బోర్డర్ గవాస్కర్ సిరీస్‌లో ఆఖరి టెస్టు ప్రారంభం కానుంది. ఐదు టెస్టుల టోర్నీలో 2-1తో ఆస్ట్రేలియా ముందంజలో ఉంది. దీంతో సిరీస్‌ను నిలబెట్టుకోవాలంటే భారత్ చివరి టెస్టు కచ్చితంగా గెలవాల్సి ఉంటుంది. ఉదయం 4.30 గంటలకు టాస్ వేస్తారు. ఉదయం 5 నుంచి 7 గంటల వరకు తొలి సెషన్, 7.40 నుంచి 9.40 వరకు రెండో సెషన్, 10 నుంచి 12 గంటల వరకు ఆఖరి సెషన్ ఉంటుంది.
News January 3, 2025
అమృత్‌పాల్ సింగ్ కొత్త పార్టీ?
ఖలిస్థానీ వేర్పాటువాది, ఎంపీ అమృత్‌పాల్ సింగ్ కొత్త పార్టీ పెడుతున్నట్లు తెలుస్తోంది. ఈ నెల 14న పంజాబ్‌లోని శ్రీ ముక్త్ సర్ సాహిబ్ జిల్లాలో జరిగే ఓ కార్యక్రమంలో పార్టీ పేరును అధికారికంగా ప్రకటిస్తారని వార్తలు వస్తున్నాయి. కాగా అజ్నాలా పీఎస్‌పై దాడి కేసులో అరెస్టైన అమృత్ పాల్ సింగ్ దిబ్రూగఢ్ జైలులో ఉన్నారు. గత ఎన్నికల్లో జైలు నుంచే ఆయన పోటీ చేసి ఖడూర్ సాహిబ్ ఎంపీగా గెలుపొందిన విషయం తెలిసిందే.