News December 26, 2024
ముఖ్యమంత్రి పదవినే వద్దనుకున్నా: సోనూ సూద్

తనకు రాజకీయాల్లో చాలా ఆఫర్లు వచ్చాయని సినీ నటుడు సోనూ సూద్ తెలిపారు. సీఎం, డిప్యూటీ సీఎం, రాజ్యసభ సభ్యుడు వంటి పదవుల ఆఫర్లు వచ్చాయని చెప్పారు. ‘కొందరు బడా నేతలు నన్ను సీఎంగా బాధ్యతలు తీసుకోవాలన్నారు. కానీ నేను దానికి అంగీకరించలేదు. నేను రాజకీయాల్లోకి వస్తే జవాబుదారీతనంతో ఉండాలి. కానీ అది నాకు నచ్చదు. ఇప్పుడు నేను స్వేచ్ఛగా సేవ చేస్తున్నా. ఇకపై కూడా ఇలాగే ఉంటా’ అని ఆయన చెప్పుకొచ్చారు.
Similar News
News October 18, 2025
కంటెంట్ క్రియేటర్లకు మస్క్ గుడ్‌న్యూస్

‘X’ అధినేత ఎలాన్ మస్క్ కంటెంట్ క్రియేటర్లకు గుడ్‌న్యూస్ చెప్పారు. తమ ఫీడ్ రికమెండేషన్ అల్గారిథమ్‌ను మార్చబోతున్నట్లు తెలిపారు. ‘6 వారాల్లో ఫీడ్ రికమెండేషన్ Grok AIకు అప్పగిస్తాం. అది ప్రతి పోస్టు, రోజుకు 100మి+ వీడియోలు చూస్తుంది. ఇంట్రెస్టింగ్ కంటెంట్‌ను రికమెండ్ చేస్తుంది’ అని తెలిపారు. అంటే పేజ్, ఫాలోవర్లతో సంబంధం లేదు. మీ కంటెంట్ ఇంట్రెస్టింగ్గా ఉంటే అది ఆటోమేటిక్‌గా వైరలయ్యే ఛాన్సుంటుంది.
News October 18, 2025
అక్టోబర్ 18: చరిత్రలో ఈ రోజు

1931: విద్యుత్ బల్బు ఆవిష్కర్త థామస్ అల్వా ఎడిసన్ మరణం
1968: భారత మాజీ క్రికెటర్ నరేంద్ర హిర్వాణి జననం
1976: కవి సామ్రాట్ విశ్వనాథ సత్యనారాయణ మరణం
1978: సినీ నటి జ్యోతిక జననం
1991: భారత మాజీ క్రికెటర్ జయదేవ్ ఉనడ్కట్ జననం
2004: గంధపు చెక్కల స్మగ్లర్ వీరప్పన్ మరణం
2013: రచయిత రావూరి భరద్వాజ(ఫొటోలో) మరణం
News October 18, 2025
పాక్ దాడుల్లో 8 మంది అప్గాన్ క్రికెటర్లు మృతి!

పాక్ జరిపిన వైమానిక దాడుల్లో అప్గానిస్థాన్ క్లబ్ లెవల్ క్రికెటర్లు 8మంది మృతి చెందినట్లు తెలుస్తోంది. ఈ విషయాన్ని అప్గాన్ క్రికెట్ బోర్డు వెల్లడించినట్లు ‘TOLO NEWS’ పేర్కొంది. మరో నలుగురికి గాయాలైనట్లు సమాచారం. మ్యాచులు పూర్తయ్యాక క్రికెటర్లు పక్టికాలోని షరానా నుంచి అర్గోన్‌కు వెళ్తుండగా బాంబు దాడులకు ప్రాణాలు కోల్పోయినట్లు చెబుతున్నారు. ఈ దాడుల్లో పౌరులు, చిన్నారులు మృతి చెందినట్లు తెలుస్తోంది.