News January 16, 2025
చిరు ఒప్పుకుంటే అలాంటి క్యారెక్టర్ రాస్తా: అనిల్ రావిపూడి

‘సంక్రాంతికి వస్తున్నాం’ హిట్‌తో దర్శకుడు అనిల్ రావిపూడి మంచి జోష్‌లో ఉన్నారు. తన తదుపరి సినిమా మెగాస్టార్ చిరంజీవితో చేయనున్నట్లు ఆయన ఇదివరకే ప్రకటించారు. కాగా మూవీ స్క్రిప్ట్ ఇంకా ఫైనలైజ్ కాలేదని అనిల్ చెప్పారు. చిరు ఒప్పుకుంటే ఘరానా మొగుడు, రౌడీ అల్లుడు వంటి క్యారెక్టర్ రాస్తానని తెలిపారు. ఇదే నిజమైతే వింటేజ్ చిరంజీవిని చూస్తామని అభిమానులు కామెంట్లు చేస్తున్నారు.
Similar News
News December 9, 2025
రూ.40 వేల కోట్లు ఇచ్చాం: కేంద్రం

2025-26 ఆర్థిక సంవత్సరంలో ఈ నెల 2వ తేదీ నాటికి ఏపీకి మొత్తం రూ.40,337 కోట్లు విడుదల చేసినట్లు కేంద్ర ఆర్థికశాఖ సహాయమంత్రి పంకజ్ చౌదరి తెలిపారు. లోక్‌సభలో BJP MP దగ్గుబాటి పురందీశ్వరి ప్రశ్నకు సమాధానంగా ఈ వివరాలను వెల్లడించారు. జాతీయ ప్రాజెక్టు అయిన పోలవరం కోసం ఇప్పటివరకు రూ.20,650 కోట్లు మంజూరు చేసినట్లు తెలిపారు. ఏపీకి బకాయిలు ఏమీ లేవని ఆయన స్పష్టం చేశారు.
News December 9, 2025
సింగిల్ డిజిట్‌కు పడిపోయిన ఉష్ణోగ్రతలు

AP: ఉత్తర కోస్తాలోని ఏజెన్సీ ప్రాంతాల్లో చలి తీవ్రత పెరుగుతోంది. నిన్న ఈ ఏడాదిలోనే అత్యల్పంగా అల్లూరి(D) దళపతిగూడలో 3.6డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. రాష్ట్రంలోని మిగతా ప్రాంతాల్లోనూ 3-4డిగ్రీల మేర ఉష్ణోగ్రతలు తగ్గాయి. వాయవ్య భారతం నుంచి మధ్య భారతం వరకు అధిక పీడనం కొనసాగడం వల్ల గాలులు వీస్తున్నాయని, ఫలితంగా చలి పెరిగిందని వాతావరణశాఖ తెలిపింది. ఈ నెల 13వ తేదీ వరకు చలి కొనసాగుతుందని పేర్కొంది.
News December 9, 2025
గొర్రెల ఎంపికలో ఈ జాగ్రత్తలు తీసుకోవాలి

గొర్రెల మంద ఎదుగుదలలో ఆడగొర్రెలది కీలకపాత్ర. ఇది ఎంత బాగుంటే మంద అంత బాగుంటుంది. ఆడ గొర్రెలు త్వరగా ఎదిగి , సంతానోత్పత్తికి అనుకూలంగా మారే లక్షణం కలిగి ఉండాలి. మందలో పునరుత్పాదక శక్తి తగ్గిన, పళ్లు లేని గొర్రెలను ఏరివేయాలి. ఏడాది కంటే ఎక్కువ కాలం ఎదకి రాని గొర్రెలు, గొడ్డుమోతు జీవాలను మంద నుంచి ఏరివేసి, చూడి లేదా తొలిసారి ఈనిన గొర్రెలను కొంటే బాగుంటుంది. ఏటా ముసలి గొర్రెలను మంద నుంచి తీసేయాలి.


