News June 29, 2024
రోహిత్ స్థానంలో నేనుంటే ఆ ప్రశ్నకు సమాధానం ఇవ్వను: సెహ్వాగ్

రోహిత్ శర్మ స్థానంలో తాను ఉంటే ఇంజమామ్ బాల్ టాంపరింగ్ <<13517621>>ఆరోపణలపై<<>> స్పందించేవాడిని కాదని సెహ్వాగ్ తెలిపారు. ‘ప్లేయర్లను రిపోర్టర్లు ఇలాంటి ప్రశ్నలు అడగటం తప్పు. ఎవరో చేసిన ఆరోపణలపై ఆటగాళ్ల అభిప్రాయాన్ని అడగొద్దు. వారు తమ సొంత ప్రశ్నలు మాత్రమే అడగాలి. ఇలాంటి ప్రశ్నలు ఆటగాళ్లకు ఏమాత్రం ఉపయోగపడవు. వివాదాలు సృష్టించేందుకు మాత్రమే పనికొస్తాయి’ అని క్రిక్బజ్ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు.
Similar News
News November 24, 2025
BREAKING: భారత్ ఆలౌట్

సౌతాఫ్రికాతో రెండో టెస్టు తొలి ఇన్నింగ్సులో భారత్ 201 పరుగులకు ఆలౌటైంది. 122కే 7 వికెట్లు కోల్పోయిన దశలో సుందర్, కుల్దీప్ 72 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. జైస్వాల్ 58, రాహుల్ 22, సాయి 15, పంత్ 7, జడేజా 6, నితీశ్ రెడ్డి 10, సుందర్ 48, కుల్దీప్ 19, బుమ్రా 5 రన్స్ చేశారు. IND 288 పరుగులు వెనుకబడింది. ఫాలో ఆన్ ఆడాల్సి ఉన్నా RSA బ్యాటింగ్ చేయాలని నిర్ణయించుకుంది. జాన్సెన్ 6 వికెట్లతో సత్తా చాటారు.
News November 24, 2025
ఫిలింఫేర్ అవార్డుపై ధర్మేంద్రకు అసంతృప్తి

నటనలో శిక్షణ తీసుకోకుండానే ఇండస్ట్రీలోకి వచ్చి మంచి నటుడిగా గుర్తింపు తెచ్చుకున్నారు ధర్మేంద్ర. ఎన్నో సినిమాల్లో నటించి సక్సెస్ అయినా ఫిలింఫేర్ ఉత్తమ నటుడి అవార్డు లభించలేదనే అసంతృప్తి ఉండేదని పలుమార్లు చెప్పేవారు. 1997లో ఫిలింఫేర్ జీవిత సాఫల్య పురస్కారం అందుకోవడం ఆనందాన్నిచ్చిందని ఉద్వేగభరితంగా చెప్పుకున్నారు. ‘గరమ్ ధరమ్ దాబా’, ‘హీ మ్యాన్’ బ్రాండ్లతో రెస్టారెంట్ వ్యాపారంలో భాగస్వామిగా ఉన్నారు.
News November 24, 2025
ఫ్యామిలీ బెనిఫిట్ మేనేజ్మెంట్ సిస్టమ్పై సీఎం సమీక్ష

APలో కొత్తగా ఏర్పాటుచేయనున్న ‘ఫ్యామిలీ బెనిఫిట్ మేనేజ్మెంట్ సిస్టమ్’పై CM చంద్రబాబు ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు. రియల్టైమ్ గవర్నెన్స్ డేటా ద్వారా సంక్షేమ పథకాలు, పౌర సేవల అమలు తీరును పర్యవేక్షించేలా ఈ సిస్టమ్ పనిచేయనుంది. దీనివల్ల అర్హులందరికీ లబ్ధి చేకూర్చేందుకు వీలు ఉంటుంది. కాగా కాసేపట్లో కొత్త జిల్లాల ఏర్పాటు, రెవెన్యూ డివిజన్లలో మార్పులపై మంత్రివర్గ ఉపసంఘంతో CM సమావేశం కానున్నారు.


